విదేశీయుల కోసం విసా రహిత విధానం ప్రకటించిన ఉక్రెయిన్.. ! కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-02T02:40:36+05:30 IST

రష్యాపై పోరాటంలో విదేశీయుల సహాయం ఆశిస్తున్న ఉక్రెయిన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశీయుల కోసం విసా రహిత విధానం ప్రకటించిన ఉక్రెయిన్.. ! కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై పోరాటంలో విదేశీయుల సహాయం ఆశిస్తున్న ఉక్రెయిన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సైన్యంలో చేరదలిచిన విదేశీయుల కోసం  వీసా తీసుకోవాలన్న నిబంధనను తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే.. రష్యా పౌరులకు ఈ అవకాశం లేదని స్పష్టం చేసింది. గతంలో అమెరికా, ఐరోపా దేశాల పౌరులు ఉక్రెయిన్‌కు వెళ్లాలంటే టూరిస్ట్ వీసా తీసుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఉక్రెయిన్ సైన్యం తరపున పోరాడదలచిన వారు ముందుగా ఓ దరఖాస్తులో తమ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. గతంలో సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంటే పేర్కొనాలి. ఈ విషయంలో ఆసక్తి ఉన్న వారు తమ దేశాల్లోని ఉక్రెయిన్ ఎంబసీలను సంప్రదించాలని విదేశాంగ శాఖ మంత్రి తాజాగా ట్వీట్ చేశారు. ‘‘మనం కలిసికట్టుగా పోరాడి హిట్లర్‌ను ఓడించాం. పుతిన్‌ను ఇదే విధంగా ఓడిస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-03-02T02:40:36+05:30 IST