Ukraine War లో విజేతలు ఉండరు.. శాంతికే భారత్ మద్ధతు: pm modi

ABN , First Publish Date - 2022-05-03T03:03:17+05:30 IST

బెర్లిన్ : Ukrain - russia war పై prime minister narendra modi కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో ఎవరూ విజేతలుగా అవతరించలేరని హితబోధ చేశారు.

Ukraine War లో విజేతలు ఉండరు.. శాంతికే భారత్ మద్ధతు: pm modi

బెర్లిన్ : Ukrain - russia war పై prime minister narendra modi కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో ఎవరూ విజేతలుగా అవతరించలేరని హితబోధ చేశారు. భారత్ శాంతికి మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఇరుదేశాలనూ ఆయన కోరారు. యుద్ధం వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతారు. ఉక్రెయిన్‌లో హృదయవిదారక దృశ్యాలే కాకుండా ఆయిల్ ధరలు పెరిగాయి, గ్లోబల్ ఫుడ్ సప్లయి చెయిన్‌పై కూడా ప్రభావం పడుతుందన్నారు. ఈ పరిణామాలు  ప్రపంచ కుటుంబంపై భారంగా మారతాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. Germany chanceller Olaf Scholz, ప్రధాని మోడీ సారధ్యంలో సోమవారం మధ్యాహ్నం భారత్ - జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్‌(ఐజీసీ) జరిగింది. బృంద స్థాయి చర్చలకు ముందు ఇరువురూ ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదలైంది. ఐజీసీ ప్లీనరీ సెషన్ ముగిసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోడీ, ఛాన్స్‌లర్ షాల్జ్ ఇరుదేశాలకు చెందిన టాప్ వ్యాపారవేత్తలతో మాట్లాడనున్నారు.

Read more