ఎక్కడా పారదర్శకత లేదు

ABN , First Publish Date - 2022-09-29T05:40:39+05:30 IST

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం, ఇసుక తదితర వాటిపై పారదర్శకంగా ఉంటుందని చెప్పారని, కానీ ఎక్కడా అది కనిపించలేదని మాజీ మంత్రి డాక్టర్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఖాజీపేటలోని తన గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాపాడు మండలం వెదురూరు గ్రామ రైతులు తన వద్దకు వచ్చి నిరంతరం ఇసుక తరలిస్తుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారన్నారు.

ఎక్కడా పారదర్శకత లేదు
మాట్లాడుతున్న డీఎల్‌ రవీంద్రారెడ్డి

స్వార్థం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు

దమ్ము, ధైర్యం ఉంటే నాపై విచారణ చేయించండి

మాజీ మంత్రి డాక్టర్‌ డీఎల్‌

ఖాజీపేట, సెప్టెంబరు 28: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం, ఇసుక తదితర వాటిపై పారదర్శకంగా ఉంటుందని చెప్పారని, కానీ ఎక్కడా అది కనిపించలేదని మాజీ మంత్రి డాక్టర్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఖాజీపేటలోని తన గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాపాడు మండలం వెదురూరు గ్రామ రైతులు తన వద్దకు వచ్చి నిరంతరం ఇసుక తరలిస్తుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారన్నారు. కోర్టులో కేసు వేయాలని కోరడంతో రెండు రోజుల్లో వేస్తామన్నారు. అలాగే ములబాక గ్రామంలోని మంచినీటి పంపు స్కీం ఉన్నచోట ఇసుకను తోడుతున్నారని, భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అక్కడి ప్రజలు తెలిపారన్నారు. అధికార యంత్రాంగానికి తెలిపినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఎమ్మెల్యేలు వాడుకుంటున్నారన్నారు. పేద ప్రజలకు సేవచేసే అవకాశం తీసుకోవాలన్నారు. క్రషర్‌లో భాగం ఉందని ఆరోపించారని, దమ్ము, ధైర్యం ఉంటే తనపై విచారణ జరిపించుకోవాలన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడం పరపాటిగా మారిందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు గ్రామంలోనే ఉంటానని, పేదల కోసం పనిచేస్తానన్నారు. పాపాలు చేసిన వారిని దేవుడు క్షమించడన్నారు.

Updated Date - 2022-09-29T05:40:39+05:30 IST