ఆలయ స్థలాన్నీ వదల్లేదు..

ABN , First Publish Date - 2022-05-08T10:56:50+05:30 IST

కమలాపురం మండల పరిధిలోని పందిళ్లపల్లె ఎస్సీ కాలనీకి పోయే దారిలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారి పక్కనే కుటాలమ్మ ఆలయం ఉంది. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ ఆల యం ఉంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరు కుంది. ప్రస్తుతం అక్కడ అమ్మవారి

ఆలయ స్థలాన్నీ వదల్లేదు..
ఆలయం స్థలం చదును చేసిన దృశ్యం

వందేళ్లకు పైగా ఆలయం ఆధీనంలో..

వారసులమంటూ కొందరు తెరపైకి

రూ.2కోట్ల విలువచేసే స్థలం కబ్జాయత్నం


ఖాళీ స్థలం కనపడితే చాలు.. ఆక్రమించేయడమే.. తాజాగా కబ్జాసురుల కన్ను గుడి స్థలంపై పడింది. రహదారి పక్కనే ఉన్న గుడి శిథిలావస్థకు చేరుకోవడం, ఇక్కడ స్థలం విలువ పెరగడంతో వారసులు పుట్టుకొచ్చారు. వందేళ్ల క్రితం నుంచి ఆలయ స్థలంగా ఉన్న భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.


కమలాపురం రూరల్‌, మే 7: కమలాపురం మండల పరిధిలోని పందిళ్లపల్లె ఎస్సీ కాలనీకి పోయే దారిలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారి పక్కనే కుటాలమ్మ ఆలయం ఉంది. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ ఆల యం ఉంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరు కుంది. ప్రస్తుతం అక్కడ అమ్మవారి విగ్రహా లు మాత్రమే ఉన్నాయి. స్థానికులు విగ్రహా లకు పూజలు చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి సుమారు ఎకరా స్థలం రోడ్డుకు ఆనుకునే ఉంది. ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.4లక్షలు పలుకుతోంది. దీంతో కొందరి కన్ను ఈ స్థలంపై పడింది. ఈ స్థలం తమ పూర్వీకులది అంటూ ఆక్రమించేందుకు వచ్చా రు. స్థలాన్ని చదును చేశారు. దీనిని స్థానికు లు అడ్డుకున్నారు. తహసీల్దార్‌, స్థానిక ఎస్‌ఐ కి ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆక్ర మణలు ఆగాయి. ఈ స్థలమంతా తమ పూ ర్వీకులదని, ఆలయానికి కావాలంటే 14 సెం ట్లు ఇస్తామని ఆక్రమణదారులు అంటున్నా రు. దీనిని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన రవి మాట్లాడుతూ గతంలో ఆ స్థలంలో కుటాల మ్మ దేవాలయం ఉండేదని, నిత్యం దీప నైవేద్యాలతో పూజలు చేసేవారని అన్నారు. ఇప్పు డు అక్కడున్న స్థలానికి ధర పెరగడం తో ఆక్రమించేందుకు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా అఽధికారులు స్పందించి ఆలయ స్థలాన్ని కాపాడాలని కోరారు. తమవద్ద ఆలయానికి సంబంధించిన దస్తావేజులు ఉన్నాయన్నారు. 


నూరేళ్లకు పైగా..

- జయన్న, స్థానికుడు 

కుటాలమ్మ దేవాలయం నూరేళ్లకు పైగా ఇక్కడ ఉంది. నా చిన్నతనం నుంచి కూడా కుటాలమ్మకు పూజలు చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వచ్చి ఈ స్థలం మా పూర్వీకులది అంటున్నారు. ఈ స్థలం కోట్ల విలువ చేస్తుంది. దేవాలయ స్థలాన్ని అధికారులే కాపాడాలి. 


గుడిని నిర్మించాలి..

- శివకుమార్‌, స్థానికుడు 

కడప-తాడిపత్రి రహదారి మార్గంలో పందిళ్లపల్లె వద్ద ప్రధాన రహదారికి అనుకొని అతి పురాతనమైన కుటాలమ్మ దేవాలయ శిథిలావస్థలో ఉంది. దీంతో కొందరు వచ్చి మేమే వారసులం అని ఆక్రమించే యత్నం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ దేవాలయం నిర్మించడానికి సహకరించాలి. 


వారసులు లేకపోవడంతో..

- విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌, కమలాపురం

పందిళ్లపల్లి గ్రామం వద్ద ఉన్న కుటాలమ్మ దేవాలయానికి సంబంధించి స్థల సమస్య  నా దృష్టికి వచ్చింది. అది ఆర్‌ఎ్‌సఆర్‌ ప్రకారం పట్టా భూమిగా ఉంది. కుటాలమ్మ దేవాలయానికి 14 సెంట్ల స్థలం ఇచ్చినట్లు డాక్యుమెంట్లు ఉన్నాయి. స్థలానికి సంబంధించిన అసలు వారసులు ఎవరూ లేకపోవడంతో మధ్యవర్తులు వచ్చి ఈ స్థలం మాది అంటున్నారు. ఆర్‌ఎ్‌సఆర్‌ నకలు తీసుకురమ్మని పది రోజులు టైం ఇచ్చాం. అవి తీసుకు వచ్చిన తర్వాత పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం.

Read more