లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు మోదీ చెప్పలేదు. మరి ఈ వార్త ఎక్కడిది?

ABN , First Publish Date - 2020-04-04T23:46:56+05:30 IST

ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ను మే 4 వరకు మోదీ ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన వీడియోకు సంబంధించిన ఓ ఇమేజ్‌ను మార్ఫింగ్ చేసి

లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు మోదీ చెప్పలేదు. మరి ఈ వార్త ఎక్కడిది?

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నివారించేందుకు ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు మోదీ ప్రకటించారని ఓ వార్త ప్రచారం అవుతోంది. ఓ జాతీయ మీడియా టీవీలో ఇది ప్రసారమైనట్లు ఒక ఇమేజ్ చూస్తే అర్థమవుతోంది. అయితే అది పూర్తిగా తప్పుడు వార్త అని, కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదని పీఐబీ పేర్కొంది.


విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ను మే 4 వరకు మోదీ ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన వీడియోకు సంబంధించిన ఓ ఇమేజ్‌ను మార్ఫింగ్ చేసి కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు. ఓ జాతీయ చానల్‌లో ఇది ప్రసారమైనట్లు ఆ ఇమేజ్‌లో ఉంది. బాగా పేరున్న జాతీయ చానల్ కావడంతో ఎక్కువ మంది నిజమే అనుకునే అవకాశాలు ఉన్నాయి.


అయితే ఇది ఎంత మాత్రమూ నిజం కాదని పీఐబీ పేర్కొంది. లాక్‌డౌన్ పొడగింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదని చెప్పింది.

Updated Date - 2020-04-04T23:46:56+05:30 IST