Abn logo
May 17 2021 @ 00:08AM

సోయా సబ్సిడీ గయా!

సోయా రైతులకు విత్తన భారం
ఈయేడు సబ్సిడీ సోయా విత్తనాలు బంద్‌
రైతులు ప్రైవేటులో కొనుగోలు చేయాల్సిందే
ఇదే అదునుగా దోచుకుంటున్న డీలర్లు
ప్రైవేటులో రూ.3,500లు పలుకుతున్న 25కిలోల సోయా విత్తనాల బస్తా
క్వింటాలుకు రూ.14వేలు
గతంలో సబ్సిడీపై రూ.4,800లకు పంపిణీ చేసిన ప్రభుత్వం
ఈసారి రైతులకు తప్పని అదనపు భారం

బోధన్‌, మే 16: రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీ యంగా మారుతోంది. వానాకాలం సీజన్‌లో సోయా రైతులకు విత్తనం భారంగా మారింది. ప్రతియేటా ప్రభుత్వం 33 శాతం సబ్సిడీపై సోయాబీన్‌ విత్తనాలను సరఫరా చేసేది. అయితే, ఈ ఏడాది సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలను సరఫ రా చేయలేమని వ్యవసాయశాఖ చేతులు ఎత్తేయడంతో స బ్సిడీ సోయాబీన్‌ విత్తనాలు లేనట్లేనని తేలిపోయింది. దీంతో సోయాబీన్‌ పంటను మాత్రమే సాగుచేసే రైతులు, సాగుకు అనుకూలంగా భూములు ఉన్న రైతులు విత్తనాలను ప్రైవే టులో కొనుక్కోవా ల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలు సరఫరా లేదని తేలిపోవడంతో ప్రైవే టులో సోయబీన్‌ విత్తనాల ధరలకు రెక్కలు వచ్చాయి. సో యాబీన్‌ విత్తనం రైతుకు భారంగా మారింది. గతంలో సబ్సి డీ సోయాబీన్‌ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తే 25కిలోల బస్తా రూ.1,200లకు సరఫరా అయ్యేది. అంటే క్వింటాలు స బ్సిడీ విత్తనాలు రూ.4,800లకు రైతుకు లభించేవి. కానీ సబ్సి డీ సోయాబీన్‌ విత్తనాలు సరఫరా లేకపోవడంతో ప్రైవేటు లో సోయా విత్తన దోపిడీ మొదలైంది. ఇప్పటికే మార్కెట్‌లో ప్రైవేటు డీలర్లు, ప్రైవేటు విత్తనదారులు 25కిలోల సోయా బీన్‌ విత్తనాల బస్తాను రూ.3,500లకు విక్రయిస్తున్నారు. అంటే క్వింటాలు సోయాబీన్‌ విత్తనాల బస్తా ప్రైవేటులో రూ.14వేలకు లభిస్తోంది. ప్రభుత్వ సబ్సిడీ సోయా విత్తనా లు కొనుగోలు చేయాలంటే క్వింటాలుకు రూ.4,800 కాగా, ప్రైవేటులో మాత్రం రూ.14వేలు అవుతున్నాయి. అంటే, ఈ లెక్కన రైతు ఒక క్వింటాలు సోయా విత్తనాలను ప్రైవేటులో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.10వేలు వెచ్చించాల్సి వస్తోంది. దాదాపు 15యేళ్ల కాలంగా సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలను ప్రభుత్వాలు పంపిణీ చేస్తూ వస్తుండగా మొట్ట మొదటి సారిగా సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాల పంపిణీకి బ్రే క్‌ పడింది. గతంలో ఇతర రాష్ర్టాల నుంచి సబ్సిడీ సోయాబీ న్‌ విత్తనాలను తెప్పించి రైతులకు సరఫరా చేసేవారు. తెల ంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక విత్తనాలను ఇతర రాష్ర్టా ల నుంచి తెప్పించడం ఏమిటని, రాబోయే రెండు మూడు సంవత్సరాలలో తెలంగాణను సీడ్‌బౌల్‌గా మారుస్తామని చె ప్పిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఏకంగా విత్తనాలు లేకుం డా చేశారు. సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలకే ఎగనామం పెట్టారు. యేళ్ల తరబడి సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలను ప్ర భుత్వం ద్వారా తీసుకుంటున్న రైతులు ఈ ఏడాది విత్తనా లు అందవని తెలియడంతో హైరానా పడుతున్నారు. సీడ్‌ బౌల్‌గా మారాల్సిన తెలంగాణ సీడ్‌లెస్‌ తెలంగాణగా మారి ందని రైతులు మండిపడుతున్నారు. గతంలో విత్తనాలు లే నప్పుడే సోయాబీన్‌ విత్తనాలను టన్నుల కొద్ది ఇతర రాష్ర్టా ల నుంచి తెప్పించి నెల రోజుల ముందే నిల్వలు చేసి విత్త నాల పంపిణీ చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు సబ్సిడీ విత్తనా లు లేవని చేతులెత్తడం చూస్తుంటే ఇదేక్కడి దుస్థితి అని రై తు టలు పెదవి విరుస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష ఎకరాలలో సాగు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ప్రతియేటా వానాకాలం సీజన్‌లో సుమారు లక్ష ఎకరాలలో రైతులు సోయా బీన్‌ పంటను సాగు చేస్తారు. వరిపంటను సాగుచేయలేని రైతులు.. నీటి నిల్వలు తక్కువగా ఉండి మెట్ట ప్రాంతాలు ఉన్న రైతులు సోయాబీన్‌ పంటను సాగుచేస్తారు. బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి డివిజన్‌ల పరిధిలో ఈ పంట సాగులో ఉంటుంది. ప్రతియేటా సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలను మే 15 నుంచి పంపిణీ చేసేవారు. మే 15 నుం చి జూన్‌ 15 వరకు సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాల పంపిణీ ప్రక్రియ సుమారు నెల రోజులకుపైనే కొనసాగేది. తొలకరి కురిసి ఆ తర్వాత ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే మె ట్టభూముల్లో రైతులు సోయా పంటను సాగు చేస్తారు. వా నాకాలం వరిపంట సాగు తరువాత అధికంగా సాగయ్యే పంట సోయాబీన్‌ మాత్రమే. దీంతో ప్రభుత్వం ప్రతియేటా 33 శాతం సబ్సిబీపైన సోయబీన్‌ విత్తనాలను పంపిణీ చేసే ది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి సోయాబీన్‌ విత్తనాల ను తెప్పించి పంపిణీ చేసేది. గతంలో 50 శాతం సబ్సిడీపై న ఆ తరువాత 40శాతం సబ్సిడీ పైన గత కొద్ది సంవత్సరా లుగా 33 శాతం సబ్సిడీ పైన సోయబీన్‌ విత్తనాల పంపిణీ కొనసాగుతోంది. కానీ, ఈ ఏడాది సబ్సిడీపై విత్తనాల పంపి ణీ లేకపోవడం రైతులకు తీవ్ర భారంగా మారింది.
ప్రైవేటులో డీలర్ల దోపిడీ
ప్రైవేటులో సోయాబీన్‌ విత్తనాల దోపిడీ కొనసాగుతోంది. సబ్సిడీపైన 25కిలోల బస్తా రూ.1,200లకు లభించగా ఇప్పు డు అదే సోయబీన్‌ బస్తా ప్రైవేటులో రూ.3,500లు పలుకు తోంది. అంటే ఈ లెక్కన ప్రైవేటులో సోయాబీన్‌ విత్తనాలు క్వింటా ధర రూ.14వేలు కాగా.. క్వింటాకు రూ.10వేల వ్య త్యాసం ఉంది. ఈ విత్తన దోపిడీ చూసి రైతులు గగ్గోలు పె డుతున్నారు. పంట పండిన తరువాత సోయాబీన్‌ ధర మా ర్కెట్‌లో క్వింటాలుకు రూ.3వేల నుంచి రూ.3,500లు కూడా పలకదు. అలాంటిది ప్రస్తుతం క్వింటాలు సోయాబీన్‌ విత్త నాలు రూ.14వేలు పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన పంటకు ధర ఉండ దు కానీ.. అదే పంట నుంచి తీసిన విత్తనాలకు మాత్రం నా లుగింతలు ధర పెంచి అమ్మడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తు న్నారు. ప్రైవేటులో సోయాబీన్‌ విత్తన దోపిడీ రైతులకు తీ వ్ర భారంగా మారింది. సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాలను ప్ర
భుత్వం సరఫరా చేయ కుండా నిలిపివేయడం ప్రైవేటులో దోపిడీకి కారణమైంది. మెట్ట, ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలు సాగుచేసుకోవాల ని చెప్పే ప్రభుత్వం విత్తనాలు ఇవ్వకుండా పంటలు ఎలా సాగుచేయమంటుందని రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో సోయాబీన్‌ పం ట సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. మరి ఈ విత్తన భారం తట్టుకొని రైతులు సోయా పంటను సాగుచే స్తారో? లేదో? వేచి చూడాలి. అంతేకాకుండా ప్రైవేటులో విత్తన దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాం గం చొరవ చూపాల్సి ఉంది. లేనట్లు అయితే సోయా రైతు లు కూడా వరి పంటనే సాగుచేసే అవకాశం ఉంది.
ఈసారి ప్రైవేటులో కొనుక్కోవాల్సిందే
- శ్రీనివాస్‌రావు, ఏవో, కోటగిరి

ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సబ్సిడీ సోయాబీన్‌ విత్త నాల సరఫరా జరగదు. రైతులు ప్రైవేటులోనే విత్తనాలను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై గత మూడు నెలలు గా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్ప టికే పలుమార్లు స్పష్టత ఇవ్వడం జరిగిందన్నారు.

Advertisement