Residence visa rule: ప్రవాసులకు ఒమన్ కీలక సూచన.. రెసిడెన్సీ వీసాకు కొత్త రూల్

ABN , First Publish Date - 2022-09-16T13:55:04+05:30 IST

రెసిడెన్సీ వీసాకు (Residence visa) సంబంధించి ప్రవాసులకు ఒమన్ పోలీసులు కీలక సూచన చేశారు.

Residence visa rule: ప్రవాసులకు ఒమన్ కీలక సూచన.. రెసిడెన్సీ వీసాకు కొత్త రూల్

మస్కట్: రెసిడెన్సీ వీసాకు (Residence visa) సంబంధించి ప్రవాసులకు ఒమన్ పోలీసులు కీలక సూచన చేశారు. రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (Royal Oman Police) తెలిపింది. దీనిలో భాగంగా వీసా స్టాంపింగ్ విషయమై కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రవాసులు పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ తప్పనిసరి కాదు. వీసా ప్రయోజనాలు పొందేందుకు నివాస కార్డు ఉంటే సరిపోతుందని ఆర్ఓపీ (ROP) వెల్లడించింది. ఇంతకుముందు ప్రవాసుల పాస్‌పోర్టులపై వీసా స్టాంపింగ్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. తాజాగా ఆ నిబంధనను తొలగించారని రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2022-09-16T13:55:04+05:30 IST