ఇప్పటికైతే వేర్వేరు టీకా డోసులు ఇచ్చే ప్రసక్తే లేదు, తేల్చి చెప్పిన కేంద్రం

ABN , First Publish Date - 2021-06-02T00:56:41+05:30 IST

కోవిషీల్డ్ విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న రెండు డోసుల విధానాన్ని ఒకే డోసుకు మార్చే విషయాన్ని పరిశీలించట్లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అంతేకాకుండా.. రెండు వేర్వేరు టీకా డోసుల విధానం లాభదాయకమని శాస్త్రీయంగా రుజువయ్యే వరకూ మిశ్రమ టీకా డోసుల ప్రసక్తే ఉండదని మంగళవారం నాడు తేల్చి చెప్పింది.

ఇప్పటికైతే వేర్వేరు టీకా డోసులు ఇచ్చే ప్రసక్తే లేదు, తేల్చి చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: కోవిషీల్డ్ విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న రెండు డోసుల విధానాన్ని ఒకే డోసుకు మార్చే విషయాన్ని పరిశీలించట్లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అంతేకాకుండా.. రెండు వేర్వేరు టీకా డోసుల విధానం లాభదాయకమని శాస్త్రీయంగా రుజువయ్యే వరకూ మిశ్రమ టీకా డోసుల ప్రసక్తే ఉండదని మంగళవారం నాడు తేల్చి చెప్పింది. టీకాల కొరత నేపథ్యంలో కేంద్రం వేర్వేరు టీకాల డోసుల అంశాన్ని పరిశీలిస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై వైద్య వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేంద్రం ఈ వివరణ విడుదల చేసినట్టు సమాచారం.


 ‘‘కోవిషీల్డ్ టీకాను రెండు డోసులుగా ఇస్తున్నాం. ఈ విధానంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకా డోసుల ఇస్తే కలిగే లాభాలు శాస్త్రీయంగా రుజువైయ్యే వరకూ..ప్రభుత్వం ఆ ప్రస్తావనే తీసుకురాదు.’’ అని డా. వీకే పాల్ మీడియాకు తెలిపారు. కరోనా కట్టడికై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌కు వీకే పాల్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలసిందే. కాగా.. టీకాల కొరతకు పరిష్కారంగా ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకా డోసులు ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్న వార్త ఇటీవల మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ విధానానికి సంబంధించి భద్రతాపరమైన అంశాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఈ నెలలో ఓ అధ్యయనం ప్రారంభించబోతున్నట్టుగా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే..ఈ అంశంపై వివిధ వేదికల ద్వారా ప్రజలు, వైద్య వర్గాలు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేశాయి. దీనికి బదులు ప్రభుత్వం టీకా ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టాలనే అభిప్రాయం బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే భారత కరోనా టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ మంగళవారం నాడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి..మిశ్రమ టీకా విధానం ప్రస్తుతానికి ఉండబోదని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-02T00:56:41+05:30 IST