కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి

ABN , First Publish Date - 2020-09-20T02:38:43+05:30 IST

కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి

కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ కొరత లేదని వైద్య విద్యాశాఖ మంత్రి కె సుధాకర్ శనివారం తెలిపారు. రాష్ట్రంలో సరఫరా అయిపోకుండా చూసేందుకు ప్రభుత్వం గుజరాత్ నుంచి ఆక్సిజన్ ట్యాంకులను తెప్పిస్తోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ఆక్సిజన్ సరఫరా చేయబడుతుందన్నారు. ఇటీవల కొన్ని ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాయని, అయితే ఆయా జిల్లాల్లోని పారిశ్రామిక మండలాల సహకారంతో ఆక్సిజన్ సమస్యను పరిష్కరించబడిందన్నారు.

Updated Date - 2020-09-20T02:38:43+05:30 IST