రోడ్లు లేవు.. కాలువలు లేవు..

ABN , First Publish Date - 2022-08-20T06:00:34+05:30 IST

కాలువలు, రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం తొమ్మిదో డివిజన్‌ పరిధిలోని కొప్పోలులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గృహాల వద్ద మహిళలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ప్రధానంగా రోడ్లు, కాలువలు లేకపోవడంతో ముగురునీరు రోడ్లపై నిలిచి దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

రోడ్లు లేవు.. కాలువలు లేవు..
ఎమ్మెల్యే బాలినినికి సమస్యలు వివరిస్తున్న ఓ వృద్ధురాలు

బాలినేని ఎదుట మహిళల ఏకరువు 

  చర్యలు తీసుకుంటానని హామీ

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 19 : కాలువలు, రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం తొమ్మిదో డివిజన్‌ పరిధిలోని కొప్పోలులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గృహాల వద్ద మహిళలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ప్రధానంగా రోడ్లు, కాలువలు లేకపోవడంతో ముగురునీరు రోడ్లపై నిలిచి దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, అందువల్ల రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బాలినేనిని కోరారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే రోడ్లు, డ్రైన్ల పనులు ప్రారంభమయ్యాయని, కొన్ని పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. ఆయా పనులన్నింటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.  కాగా రూ. 40 లక్షలతో గుత్తికొండవారిపాలెం రోడ్డులోని కొప్పోలుకు  చెందిన శ్మశాన కాంపౌండ్‌ వాల్‌కు ఎమ్మెల్యే బాలినేని శంకుస్థాపన చేశారు. 

స్పందన నిర్వహించిన బాలినేని

  ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై స్థానిక లాయర్‌పేటలోని బాలినేని నివాసంలో శుక్రవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రూరల్‌, కొత్తపట్నం మండలాలకు చెందిన ప్రజలు పలు రకాల సమస్యలను బాలినేని దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, ఎంపీపీ మల్లికార్జునరెడ్డి, వైసీపీ నాయకులు కటారి శంకర్‌, గంటా రామానాయుడు, గోలి తిరుపతిరావు, యలనమల నాగరాజు, వెన్నపూస వెంకటరెడ్డి, శోభారాణి, అయినాబత్తిన ఘనశ్యాం, సువర్ణ, తమ్మినేని మాధవి, బొమ్మినేని మురళీ, పూర్ణచంద్రారెడ్డి, కే సీతారామయ్య, పులుగు అక్కిరెడ్డి, భవనం సుబ్బారెడ్డి, మరియమ్మ, నరసయ్య తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-08-20T06:00:34+05:30 IST