రైతులపై రాజకీయం చేసే హక్కు లేదు: మోదీ

ABN , First Publish Date - 2022-02-08T00:28:13+05:30 IST

ఇక దేశ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వాటి గురించి వివరిస్తూ దేశంలోని పేద ప్రజలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారని, ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకుంటున్నారని మోదీ అన్నారు. వీటికి ప్రభుత్వం నుంచి అందే సాయం నేరుగా లబ్దిదారుల..

రైతులపై రాజకీయం చేసే హక్కు లేదు: మోదీ

న్యూఢిల్లీ: దేశానికి అన్నం పెట్టే రైతులపై రాజకీయం చేసే హక్కు ఎవరికీ లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ దేశ బలం చిన్న, సన్నకారు రైతులని వారిని బలవంతులను చేయాల్సిన అవసవరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు వీరిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, వారి బాధను అర్థం చేసుకోవడం లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.


ఇక దేశ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వాటి గురించి వివరిస్తూ దేశంలోని పేద ప్రజలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారని, ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకుంటున్నారని మోదీ అన్నారు. వీటికి ప్రభుత్వం నుంచి అందే సాయం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో పడుతోందని ఆయన పేర్కొన్నారు. కానీ కొందరు ఇది ఓర్చుకోలేక పోతున్నారని, వారింకా 2014కి ముందు ఆగిపోయారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ అన్నారు.

Updated Date - 2022-02-08T00:28:13+05:30 IST