ఇంటి వద్దకే బియ్యం కాదండోయ్‌.. పొలం వద్దకే ఎరువులు?

ABN , First Publish Date - 2021-07-27T06:26:06+05:30 IST

ఇంటి వద్దకే సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ఇ టీవల ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు పక్కదారిపట్టాయి. ఏకంగా పొ లాలకు రసాయనిక ఎరువుల మందులు తరలించేందుకు ఈ వాహనాలే దిక్కయ్యాయి.

ఇంటి వద్దకే బియ్యం కాదండోయ్‌.. పొలం వద్దకే ఎరువులు?
ఎండీయూ వాహనంలోకి ఎరువుల బస్తాలు లోడ్‌ చేస్తున్న దృశ్యం

ఎండీయూ ఆటోనా... మజాకా!

కర్నూలు జిల్లా నుంచి వచ్చి రాయలచెరువులో ఎరువుల లోడింగ్‌


యాడికి, జూలై 26: ఇంటి వద్దకే సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ఇ టీవల ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు పక్కదారిపట్టాయి. ఏకంగా పొ లాలకు రసాయనిక ఎరువుల మందులు తరలించేందుకు ఈ వాహనాలే దిక్కయ్యాయి. సోమవారం మండలంలోని రాయలచెరువు గ్రామంలో ఇ లాంటి దృశ్యమే అగుపించింది. కర్నూలు జిల్లా చండ్రపల్లె గ్రామానికి చెం దిన ఎండీయూ ఆపరేటర్‌ యాడికి మండలంలోని రాయలచెరువు గ్రా మానికి బియ్యం తరలించే వాహనాన్ని తీసుకొచ్చాడు. మన గ్రోమోర్‌ గోడౌ న వద్ద రసాయనిక ఎరువుల బస్తాలను ఎండీయూ వాహనంలోకి లోడ్‌ చేసుకోవడం కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు ఎండీయూ ఆటో నా... మజాకా అంటూ పెదవి విరిచారు.. ఎరువుల మూటలను తరలించే టప్పుడు మార్గమధ్యంలో వర్షం వచ్చినా ఏఇబ్బంది ఉండదు... ఇదేదో బా గుందే అని కొందరు చర్చించుకుంటుంటే.... మరికొందరు ఎండీయూ వాహ నాలను ఇలా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్ని స్తున్నారు. ఎండీయూ వాహనంలో పొలాలకు రసాయనిక ఎరువుల మూ టలు తరలించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 



Updated Date - 2021-07-27T06:26:06+05:30 IST