టీటీడీలో ఉద్యోగుల భర్తీ లేదు: పీఆర్వో డాక్టర్ రవి

ABN , First Publish Date - 2021-01-27T02:35:31+05:30 IST

టీటీడీలోఉద్యోగుల భర్తీ కోసం ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదని టీటీడీ పీఆర్వో డాక్టర్ రవి

టీటీడీలో ఉద్యోగుల భర్తీ లేదు: పీఆర్వో డాక్టర్ రవి

 తిరుమల: టీటీడీలో ఉద్యోగుల భర్తీ కోసం ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదని టీటీడీ పీఆర్వో డాక్టర్ రవి తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడారు. టీటీడీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆయన అన్నారు. ఒకవేళ ఉద్యోగాలు భర్తీ చేస్తే టీటీడీ బహిరంగ ప్రకటనలు జారీ చేస్తుందని రవి తెలిపారు.

Updated Date - 2021-01-27T02:35:31+05:30 IST