సరిహద్దుల్లో బలగాలు యథాతథం: బీఎస్ఎఫ్

ABN , First Publish Date - 2020-04-09T20:15:33+05:30 IST

దేశ సరిహద్దుల్లో అప్రమత్తత కొనసాగుతుంటుదని, బలగాల మోహరింపులో ఎలాంటి కుదింపు ఉండదని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్..

సరిహద్దుల్లో బలగాలు యథాతథం: బీఎస్ఎఫ్

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో అప్రమత్తత కొనసాగుతుంటుదని, బలగాల మోహరింపులో ఎలాంటి కుదింపు ఉండదని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ తెలిపారు. ఐటీబీపీ డీజీ బాధ్యతలతో పాటు బీఎస్‌ఎఫ్ జీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ్వాల్ బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సేవలందించడంలో బలగాలు ఎప్పుడూ ముందుంటాయని, అలాగని ఆ ప్రభావం సరిహద్దు బలగాల మోహరింపులపై ఏమాత్రం ఉండదని ఆయన వివరించారు.


'సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. బలగాలు తగ్గింపు ప్రసక్తి లేదు' అని దేశ్వాల్ స్పష్టం చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బీఎస్ఎఫ్ యూనిట్లు వివిధ రాష్ట్రాల్లో స్థానిక యంత్రాంగాలకు సహకరిస్తున్నాయని చెప్పారు.

Updated Date - 2020-04-09T20:15:33+05:30 IST