మేఘమా.. కురువవే..!

ABN , First Publish Date - 2022-07-06T04:43:16+05:30 IST

ఆకాశంలో మబ్బులు దోబూచులాడుతున్నాయి..

మేఘమా.. కురువవే..!

ఆకాశంలో మబ్బులు దోబూచులాడుతున్నాయి.. రోజూ కారు మబ్బులు కమ్ముకొస్తున్నా.. చినుకులు మాత్రం కురవడం లేదు. వానల కోసం రోజూ నింగి వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతుకు నిరాశే ఎదురవుతుంది. కొందరు విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. మరికొందరు విత్తిన వాటిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేయగానే.. ఈ రోజు జోరు వాన కురుస్తదిలే అని ఆనంద పడుతున్న రైతు ఆశలకనుగుణంగా ఒక్క చినుకు పడకుండానే కనుమరుగవుతున్నాయి. యాచారం మండలంలో సోమవారం మధ్యాహ్నం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురుస్తుందని రైతులు ఆశించారు. కానీ నానక్‌నగర్‌, తాడిపర్తి, మేడిపల్లి, మాల్‌ గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురవడంతో నిరాశ చెందారు. 

- యాచారం


Updated Date - 2022-07-06T04:43:16+05:30 IST