దక్షిణ కొరియా కీలక ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు..!

ABN , First Publish Date - 2021-06-17T05:26:26+05:30 IST

కోవిషీల్డ్ తీసుకుని దక్షిణ కొరియాకు వచ్చే భారతీయ ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే..కొవ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం

దక్షిణ కొరియా కీలక ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు..!

న్యూఢిల్లీ: కోవిషీల్డ్ తీసుకుని దక్షిణ కొరియాకు వచ్చే భారతీయ ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే..కొవ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం తమ దేశంలోకి అడుగుపెట్టాక కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని, ఇది పూర్తి చేసుకున్నాకే తమ గమ్యస్థానాలవైపు వెళ్లాలని ప్రభుత్వం వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశాధినేతలు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది.

Updated Date - 2021-06-17T05:26:26+05:30 IST