మెరుగుపడని సర్వర్‌

ABN , First Publish Date - 2021-08-04T05:53:02+05:30 IST

జిల్లాలో రేషన్‌ పంపిణీకి సర్వర్‌ సమస్య ప్రతిబంధకంగా మారింది.

మెరుగుపడని సర్వర్‌
ఒంగోలులోని ఓ మొబైల్‌ వాహనం వద్ద నిరీక్షిస్తున్న కార్డుదారులు

రెండో రోజూ అదే పరిస్థితి

ఒంగోలు(కలెక్టరేట్‌),ఆగస్టు 3 : జిల్లాలో రేషన్‌ పంపిణీకి సర్వర్‌ సమస్య ప్రతిబంధకంగా మారింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పంపిణీ ప్రారంభించగా మంగళవారం కూడా సర్వర్‌ డౌన్‌ కావడంతో కార్డుదారులు మొబైల్‌ వాహనాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒంగోలులో సర్వర్‌ కొంత మేర మెరుగవగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు వస్తోందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 1.06లక్షల రేషన్‌కార్డులు ఉండగా మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయానికి 1.24లక్షల కార్డుదారులకు సరుకులు అందాయంటే సర్వర్‌ ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల్లో కేవలం 12.39శాతం మందికి మాత్రమే సరుకులు అందాయి. రేషన్‌ పంపిణీలో రాష్ట్రంలో జిల్లా 10వ స్థానంలో ఉంది. ప్రతినెల ఇదే పరిస్థితి ఉన్నా సర్వర్‌ స్పీడ్‌ పెంచే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2021-08-04T05:53:02+05:30 IST