రెండు టెస్టుల్లోనూ తప్పులు జరిగే అవకాశం ఒకటే: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-08-10T04:04:59+05:30 IST

దేశరాజధానిలో కరోనాను పసిగట్టేందుకు యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

రెండు టెస్టుల్లోనూ తప్పులు జరిగే అవకాశం ఒకటే: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి

న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనాను పసిగట్టేందుకు యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రామాణిక కరోనా పరీక్షగా గుర్తింపు పొందిన ఆర్‌టీపీసీఆర్ టెస్టు, యాంటీజెన్‌ టెస్టు రెండిట్లోనూ తప్పులు వచ్చే అవకాశం ఓకే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.  యాంటీజెన్‌ టెస్టుల వల్ల కరోనా లేని వారు కూడా పాజిటివ్‌లుగా తేలే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీసోడియా..యాంటీజెన్ టెస్టుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, అందులో ముఖ్యమైనది త్వరితగతిన ఫలితాలు రావడం అని తెలిపారు. అంతే కాకుండా.. కరోనా లేకపోయినా ఉన్నట్టు చూపించే అవకాశం ప్రామాణిక ఆర్‌టీపీసీఆర్‌లో ఎంత ఉందో యాంటీజెన్ పరీక్షలోనూ అంతే ఉందని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-08-10T04:04:59+05:30 IST