లాక్‌డౌన్: రైళ్ల పునరుద్ధరణపై రైల్వే శాఖ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-04-04T21:57:12+05:30 IST

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ తర్వాత రైల్వే సేవలను ..

లాక్‌డౌన్: రైళ్ల పునరుద్ధరణపై రైల్వే శాఖ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించే అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వేశాఖ  స్పష్టం చేసింది. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము తప్పకుండా వెల్లడిస్తామని ట్విటర్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఈ నెల 12తో ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి రైల్వే సేవల పునరుద్ధరణ, టికెట్ బుకింగ్‌పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విటర్ వేదికగా రైల్వే శాఖ స్పందిస్తూ....


‘‘లాక్‌డౌన్ తర్వాత రైల్వే సేవల పునరుద్ధరణ, రాకపోకలపై మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ప్యాసెంజర్ సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాం. ఈ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అందరికీ వెల్లడిస్తాం...’’ అని స్పష్టం చేసింది. పాలు, బియ్యం, గోధుమలు సహా ఇతర నిత్యావసర వస్తువుల కోసం పార్సిల్ ట్రైన్లను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపింది. కాగా లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా గూడ్స్ రైళ్లు యథాతథంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-04T21:57:12+05:30 IST