Central Govt : 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనమీ లేదు : కేంద్రం

ABN , First Publish Date - 2022-08-09T22:34:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వ(Central Govt) ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని( pay commission) ఏర్పాటు చేసే ప్రతిపాదనేమీ తమవద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Central Govt : 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనమీ లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ(Central Govt) ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని( pay commission) ఏర్పాటు చేసే ప్రతిపాదనేమీ తమవద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి ప్రణాళికలేమీ పరిశీలనలో లేవని ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి(Pankaj Chaudhary) తెలిపారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా పార్లమెంట్‌కి సమాధానమిచ్చారు. 8వ వేతన సంఘానికి సంబంధించిన ప్రతిపాదనలేవీ తమ పరిశీలనలో లేవన్నారు. అయితే ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల జీతం విలువ తగ్గుతుంది కాబట్టి పరిహారం ద్వారా ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డీఏని(DA) ప్రతి 6 నెలలకు ఒకసారి సవరిస్తామని తెలిపారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌కి అనుగుణంగా సర్దుబాటు ఉంటుందన్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి డీఏ పెంపు ఉండొచ్చని అంచనా వేశారు.

Updated Date - 2022-08-09T22:34:05+05:30 IST