200 కేజీల భారీ రష్యా పంది.. పేరు పుతిన్.. ఈ పరిస్థితి మరే పందికీ రాకూడదంటూ..

ABN , First Publish Date - 2022-04-24T02:14:11+05:30 IST

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడ్డాడంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పాశ్చా్త్య దేశాలు ఫైరైపోతున్నాయి. అయితే.. పాశ్చాత్య దేశాల ప్రజల్లో పుతిన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి చివరకు పుతిన్ అనే పంది పేరు మారిపోయేలా చేసింది.

200 కేజీల భారీ రష్యా పంది.. పేరు పుతిన్.. ఈ పరిస్థితి మరే పందికీ రాకూడదంటూ..

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడ్డాడంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఫైరైపోతున్నాయి. అక్కడి ప్రజల్లోనూ పుతిన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి చివరకు పుతిన్ అనే పంది పేరు మారిపోయేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  జర్మనీలోని బవేరియాలో గల ఓ జంతు ప్రదర్శనశాలలో ఓ అడవి పంది ఉంది. అది మామాలూ పంది కాదు. రష్యాలో పెరిగింది. జర్మనీలో కనిపించే సాధారణ పందులకంటే ఏకంగా మూడు రెట్లు పెద్దది. బరువు దాదాపు 200 కేజీలు. అయితే..ఆ పంది పూర్తిగా రష్యా రకానికి చెందినది కావడంతో ఆ జంతు ప్రదర్శనశాల యజమాని దాన్ని పుతిన్ అని ముద్దుగా పిలుచుకునే వాడు. మూడేళ్ల క్రితం ‘పుతిన్’ ఆ జంతు ప్రదర్శనశాలకు వచ్చింది. 


కాగా.. ఉక్రెయిన్‌పై దాడి తరువాత అధ్యక్షుడు పుతిన్ పాశ్చాత్య దేశాల్లో అప్రదిష్టపాలైపోయారు. దీంతో.. తన వద్దకు వచ్చేవారందరూ పందిని పుతిన్ అంటూ పిలవడం ఆ జంతు ప్రదర్శనశాల యజమానికి ఇబ్బందిగా మారింది. దీనితోడు.. ఉక్రెయిన్ నుంచి వలసవచ్చిన ఎందరో శరణార్థులు ఆ ప్రాంతంలోనే తలదాచుకుంటున్నారు. దీంతో.. సమస్య మరింత ముదిరినట్టు ఆయన భావించాడు. దీంతో.. ఆ పందిపేరు మార్చడమే ఈ సమస్యను పరిస్కారమని నిర్ధారించుకుని ఇటీవలే ఆ పని పూర్తి చేశాడు. క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి.. దానికి ఎబర్‌హోఫర్ అని పేరు పెట్టాడు. ప్రపంచంలో మరే పందికి ఇటువంటి పేరు ఉండకూడదంటూ ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-04-24T02:14:11+05:30 IST