భౌతిక దూరం ఏదీ?

ABN , First Publish Date - 2021-05-08T04:58:20+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రవేశ గేట్ల నుంచి ఉక్కు అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఒకేసారి వెళ్తున్నారు.

భౌతిక దూరం ఏదీ?
స్టీల్‌ప్లాంట్‌ గేటు వద్ద ఒకేసారి ప్రవేశిస్తున్న ఉద్యోగులు

ఉక్కుటౌన్‌షిప్‌, మే 7: స్టీల్‌ప్లాంట్‌ ప్రవేశ గేట్ల నుంచి ఉక్కు అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఒకేసారి వెళ్తున్నారు. దీనివలన కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముందుని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుల్‌ హ్యాండ్‌ షర్టులు వేసుకోవాలని, మాస్క్‌ ధరించాలని, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జనరల్‌ డ్యూటీ సమయంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఒక్కసారిగా రావడంతో ఒకే ప్రదేశంలో గుమిగూడుతున్నారు. ఉద్యోగులు గేటు సమయం కంటే కాస్తా ముందుగా వస్తే ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-08T04:58:20+05:30 IST