వాటిని తెరిచేందుకు ఇప్పట్లో అనుమతి లేదు : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-10-25T01:30:15+05:30 IST

పాఠశాలలను తిరిగి తెరిచేందుకు ప్రస్తుతానికి అనుమతి

వాటిని తెరిచేందుకు ఇప్పట్లో అనుమతి లేదు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : పాఠశాలలను తిరిగి తెరిచేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం చెప్పారు. ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో విద్యార్థులకు, ప్రజలకు కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. భారతీయులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉండాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 


కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలు చేయడంతో పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. పాఠశాలలను తిరిగి తెరిస్తే, ఈ వ్యాధి మరింత విజృంభిస్తుందన్న ఆందోళన విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో రెండు ఫ్లై ఓవర్లను ప్రారంభించిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ, పాఠశాలలను తిరిగి తెరిచేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదని తెలిపారు. భారతీయులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉండాలన్నారు. ఇది భారతీయుల హక్కు అని తెలిపారు. ప్రజలందరూ ఈ వైరస్ వల్ల ఇబ్బందులు అనుభవిస్తున్నారని, వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందాలని అన్నారు. 


ఢిల్లీలో 3,48,000 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6,189 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 78 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాదాపు 1.17 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.


Updated Date - 2020-10-25T01:30:15+05:30 IST