‘పావలా’ ఇవ్వరా!

ABN , First Publish Date - 2022-05-05T05:30:00+05:30 IST

గ్రామీణ పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గత ప్రభుత్వాలు మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేశాయి. ఈ సంఘాల సభ్యుల కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాన్ని సూచించిన కాలపరిమితిలో ప్రతీనెల తిరిగి చెల్లిస్తే డబ్బుపై చెల్లించిన పావలా వడ్డీని వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసేది. ఈ పథకం కొన్నాళ్లు సజావుగా కొనసాగింది. కానీ నాలుగేళ్లుగా వడ్డీ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ అందడం లేదు.

‘పావలా’ ఇవ్వరా!

వడ్డీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు

జిల్లాకు రావాల్సిన మొత్తం రూ. 125.18 కోట్లు

18,083 స్వయం సహాయక సంఘాల్లో 1.90 లక్షల మంది సభ్యులు

నాలుగేళ్లు గడుస్తున్నా విడుదల కాని పావలా వడ్డీ


జహీరాబాద్‌, మే 5: గ్రామీణ పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గత ప్రభుత్వాలు మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేశాయి. ఈ సంఘాల సభ్యుల కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాన్ని సూచించిన కాలపరిమితిలో ప్రతీనెల తిరిగి చెల్లిస్తే డబ్బుపై చెల్లించిన పావలా వడ్డీని వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసేది. ఈ పథకం కొన్నాళ్లు సజావుగా కొనసాగింది. కానీ నాలుగేళ్లుగా వడ్డీ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ అందడం లేదు. 


సంగారెడ్డి జిల్లాకు రావాల్సింది రూ. 125.18 కోట్లు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 688 గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో 18,083 స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. వీటిలో 1,90,610 మంది సభ్యులున్నారు. అయితే వీరు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం పావలా వడ్డీ కింద 125.18 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉన్నది. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలు ప్రతీ నెల సక్రమంగా చెల్లిస్తున్నా 2018 నుంచి ప్రభుత్వం పావలా వడ్డీ ఇవ్వడం లేదు. వడ్డీ డబ్బులు విడుదల చేయక నాలుగు సంవత్సరాలు గడుస్తున్నది. దీంతో మహిళా సంఘాల సభ్యులు రుణాలు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పావలా వడ్డీ డబ్బులు విడుదల చేస్తే వారికి ఆసరాగా ఉంటుంది.


పావలా వడ్డీ డబ్బు విడుదల చేయాలి - చంద్రకళ, దిగ్వాల్‌

ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన పావలా వడ్డీని చెల్లిస్తే సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రతీ నెల సకాలంలో రుణాలు చెల్లిస్తున్నా పావలా వడ్డీ విడుదల చేయకపోవడం సరికాదు. ఎన్నో కష్టాలు పడుతున్న పొదుపు సంఘాల సభ్యులను ఆర్థికంగా ఆదుకోవాలి. 


నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు -సుకన్య, పైడిగుమ్మల్‌

గతంలో పావలావడ్డీ సక్రమంగా విడుదల చేసేవారు. నాలుగు సంవత్సరాలుగా పావలా వడ్డీ తిరిగి రాకపోవడంతో తీసుకున్న రుణాలు చెల్లిండచానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పావలా వడ్డీ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారోనని ఎదురు చూస్తున్నాం.

Read more