‘గ్రేటర్‌’లో ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు

ABN , First Publish Date - 2020-11-28T07:58:50+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ రాజకీయ పార్టీకీ, ఎన్నికల్లో పోటీ చేసే ఏ

‘గ్రేటర్‌’లో ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి 

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ రాజకీయ పార్టీకీ, ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికీ మద్దతు తెలపడం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని గతంలో తెలియజేసినట్టు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఎవరికి ఓటు వేస్తే డివిజన్లలో అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేయాలని జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులకు ఆయన సూచించారు


Updated Date - 2020-11-28T07:58:50+05:30 IST