Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైలు పట్టాలపై ఎవరూ వెళ్లొద్దు : తహసీల్దార్‌

కమలాపురం(రూరల్‌), డిసెంబరు 5: స్థానిక రైల్వే పట్టాలపై ఎవరూ వెళ్లొద్దని తహసీల్దార్‌ విజయకుమార్‌ తెలిపారు. కమలాపురం పాపాఘ్నినది వంతెన కూలిపోవడంతో కమలాపురం నుంచి వల్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలకు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్థులు, కూలీలు కడపకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ కట్ట వరకు వెళ్లి అక్కడి నుంచి ఆటోలో, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమని గుర్తించిన తహసీల్దారు అక్కడకు వెళ్లి పరిశీలించారు. రైల్వే ట్రాక్‌పై ఎవ్వరూ వెళ్లకుండా చూడాలని కమలాపురం, వల్లూరు పోలీసులను ఆదేశించారు. త్వరలో వంతెనపై కాలినడకన వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement