సీఏఏపై ఎవరూ భయపడొద్దు

ABN , First Publish Date - 2020-02-22T08:23:30+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)పై ఎవరూ భయపడాల్సిన పనిలేదనీ, ఎవర్నీ దేశం నుంచి వెళ్ళగొట్టబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

సీఏఏపై ఎవరూ భయపడొద్దు

  • దేశం నుంచి ఎవర్నీ వెళ్లగొట్టం: ఉద్ధవ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)పై ఎవరూ భయపడాల్సిన పనిలేదనీ, ఎవర్నీ దేశం నుంచి వెళ్ళగొట్టబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీని కలిసిన తర్వాత శుక్రవారం ఠాక్రే మీడియాతో మాట్లాడారు. గతంలో  బీజేపీతో కలిసి సంకీర్ణ భాగస్వామిగా ఉన్న శివసేన...మహారాష్ట్ర ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌, ఎన్సీపీతో కొత్త కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ‘‘మహారాష్ట్ర సమస్యలపైనా, సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలపై ప్రధానితో చర్చించాను. ఎవరూ భయపడనవసరం లేదు. ఎవర్నీ దేశం నుంచి వెళ్ళగొట్టం’’ అని ఠాక్రే పేర్కొన్నారు. కాగా, ఉద్ధవ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిసి అరగంటపాటు చర్చలు జరిపారు. 

Updated Date - 2020-02-22T08:23:30+05:30 IST