Abn logo
May 30 2020 @ 18:41PM

‘రంగు’ కారణంగా ఎవరూ చనిపోకూడదు: ప్రియాంక చోప్రా

ముంబై: అమెరికాలో పోలీసుల దాష్టీకానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కూడా ఫ్లాయిడ్‌కు మద్దతుగా నిలిచారు. కేవలం శరీరపు రంగు కారణంగా ఎవరూ చనిపోకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టారు. ‘మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. అది కూడా ఇప్పుడే మొదలు పెట్టాల్సి ఉంది.


ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమంతతాముగా వర్ణ వ్యవస్థను రూపుమాపాలి. అమెరికాలోనే కాకుండా ప్రపంచం మొత్తం దీనికోసం పాటుపడాలి’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఎవరు ఎక్కడ నివశిస్తున్నా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నా.. కేవలం శరీరపు రంగు కారణంగా ఇతరుల చేతిలో మరణించకూడదని ప్రియాంకా పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement