అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు : ఎమ్మెల్యే చిరుమర్తి

ABN , First Publish Date - 2022-01-26T06:04:28+05:30 IST

నకిరేకల్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకో లేరని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిరేకల్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు ప్రతిపక్ష నాయకులు మార్కెట్‌పై తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్ర

అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు : ఎమ్మెల్యే చిరుమర్తి
కట్టంగూరు మండలం పామనుగుండ్లలో శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్‌, జనవరి 25: నకిరేకల్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకో లేరని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిరేకల్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు ప్రతిపక్ష నాయకులు మార్కెట్‌పై తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నా రన్నారు. ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకోని నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే నకిరేకల్‌ మం డల పరిషత్‌ ఆవరణలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసు కున్నామన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వాస్త వాలు చెప్ప కుండా కొందరు అఖిలపక్ష నాయకులు మండల పరిషత్‌ ఆవరణలో సమీకృత మార్కెట్‌ పెట్టేందుకు భవనాలు సరికాదని ఎంపీతో కలిసి జిల్లా కలెక్టర్‌కు విన తిపత్రం అందజేయడం సమంజసం కాదన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనువాస్‌గౌడ్‌, జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, మురారిశెట్టి కృష్ణమూర్తి, యల్లపురెడ్డి సైదిరెడ్డి, కొండ శ్రీను, పెండెం సదానందం, గుర్రం గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.  

కట్టంగూరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పామనగుండ్ల, కలిమెర, నారెగూడెం, నల్లగుంటబోలు గ్రామాల్లో సీసీరోడ్లకు మంగళవారం శంకుస్థాపన చేశారు. నారెగూడెం గ్రామంలో పల్లెప్రకృతివనం, వైకుంఠధామాలను ప్రారంభింబారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తరాల బలరాములు, వైస్‌ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, ఎంపీడీవో సునీత, తహసీల్ధార్‌ హుస్సేన్‌, ఏడుకొండలు, సర్పంచ్‌లు వడ్డె సైదిరెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, కురిమిల్ల పూలమ్మ, పొన్నబోయిన లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:04:28+05:30 IST