ఆ రాష్ట్రంలోని 62 జిల్లాల్లో కరోనా కొత్త కేసులు నిల్... యాక్టివ్ కేసులు 250

ABN , First Publish Date - 2021-09-06T14:17:21+05:30 IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

ఆ రాష్ట్రంలోని 62 జిల్లాల్లో కరోనా కొత్త కేసులు నిల్... యాక్టివ్ కేసులు 250

లక్నో: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాగా ఉంది. గడచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్ పరీక్షలో మొత్తం 62 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు, గడచిన 24 గంటల్లో 2 లక్షల 34 వేల 971 కోవిడ్ టెస్టులు చేయగా కేవలం 18 మందికి మాత్రమే కరోనా సోకిందని తేలింది. 


ఇదే సమయంలో 31 ​​మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 16 లక్షల 86 వేల 354 మంది కరోనా నుంచి విముక్తిపొందారు ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 250కి దిగువగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా రికవరీ రేటు 98.7 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.01 శాతంగా ఉంది. దేశంలో అత్యధిక కరోనా టీకాలు వేసిన రాష్ట్రంగా యూపీ నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 7 కోట్ల 75 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకూ 7 కోట్ల 34 లక్షల 53 వేల 81 కోవిడ్ టెస్టులు చేశారు.

Updated Date - 2021-09-06T14:17:21+05:30 IST