నో.. నెట్‌వర్క్‌

ABN , First Publish Date - 2022-07-03T05:12:50+05:30 IST

మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలోనున్న యూనియన్‌ బ్యాంకు సేవలకు వరుసగా రెండురోజులుగా తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

నో.. నెట్‌వర్క్‌
బ్యాంకు మూసివేయడంతో బయట నిలుచున్న ఖాతాదారులు

- ఎర్రవల్లి యూనియన్‌ బ్యాంకు సేవలకు ఆటంకం

- నెట్‌వర్క్‌ సమస్యతో ఖాతాదారుల పడిగాపులు 


ఎర్రవల్లి చౌరస్తా, జూలై 2: మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలోనున్న యూనియన్‌ బ్యాంకు సేవలకు వరుసగా రెండురోజులుగా తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్ర, శనివారాలు బ్యాంకుకు నెట్‌వర్క్‌ ప్రాబ్లమ్‌ ఉందని సిబ్బంది చెప్పడంతో చేసేదేమీ లేక పని నిమిత్తం వచ్చిన జనాలు పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరిగారు. జూలై మొదటివారం కావడంతో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం, అలాగే, రైతుబంధు డబ్బుల కోసం రైతులు బ్యాంకుకు వచ్చారు. అనూహ్యంగా సేవలకు ఆటంకం కల్గడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నెలలో రెండు, మూడుసార్లు ఇలాగే నెట్‌వర్క్‌ సమస్య ఉంటుందని ఖాతాదారులు వాపోయారు. నేడు ఆదివారం సెలవుదినం కావడంతో మూడు రోజులు సేవలు నిలిచిపోగా సోమవారం కూడా పనిచేస్తుందో, లేదో ప్రశ్నార్థకంగా మారింది. సేవల ఆటంకంపై శాఖ నిర్వహణ అధికారి నందకిశోర్‌ను వివరణ కోరగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ సేవలు సరిగ్గా అందడం లేదని, మరోవైపు కేబుల్‌ సమస్య ఉందని, అయితే సమస్యను పరిష్కరించేం దుకు ఆపరేటర్‌ ఒక్కరే ఉండడంతో చేసేదేమీ లేదని తెలిపారు.

Updated Date - 2022-07-03T05:12:50+05:30 IST