Abn logo
Feb 21 2020 @ 22:30PM

టాలీవుడ్‌కి ఈ భామ టాటా చెప్పేసిందా?

కొందరి దురదృష్టం అంతే. అందముంటుంది... నటించే సత్తా ఉంటుంది. కానీ అదృష్టమే ఆమడదూరంలో ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అనుపమ పరమేశ్వరన్‌కు ఎదురైంది. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అందచందాలకేమీ లోటు లేదు. కాకపోతే ఎక్స్‌పోజింగ్‌కు కాస్త దూరంగా ఉంటుంది. అదే ఆమెకు మైనస్‌. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ చిన్న సినిమా ఉంది. దాని తరువాత మరే సినిమా ఉండదు. టాలీవుడ్‌లో కన్నా కోలీవుడ్‌, మాలీవుడ్‌ మీద దృష్టిసారించాలని అనుపమ భావిస్తోందట. ఇక మీదట తెలుగు తెర మీద అనుపమ సినిమా కనిపించకపోవచ్చంటున్నారు సినీ జనాలు.

Advertisement
Advertisement
Advertisement