60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ కోసం మెడికల్ సర్టిఫికెట్ అక్కర్లేదు: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-28T22:10:32+05:30 IST

ఇతర వ్యాధులతో బాధపడుతూ 'ప్రికాషనరీ డోస్' (బూస్టర్ డోస్) తీసుకోవాలనుకునే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు..

60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ కోసం మెడికల్ సర్టిఫికెట్ అక్కర్లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: ఇతర వ్యాధులతో బాధపడుతూ 'ప్రికాషనరీ డోస్' (బూస్టర్ డోస్) తీసుకోవాలనుకునే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమ పేరు నమోదు చేసుకోవాలకునే వారు మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే రిజిస్టర్ చేయించుకోవచ్చని, బూస్టర్ డోస్ తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మంగళవారంనాడు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అరవై ఏళ్ల పైబడిన వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని అనుకుంటే డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని సమావేశం నిర్ణయించింది. అయితే, వ్యాక్సిన్ తీసుకునే ముందు వారు తమ సొంత వైద్యుని  తప్పనిసరిగా సంప్రదించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ లేఖలు రాశారు.


ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్ల క్యాటగిరిలోకి వస్తారని, ప్రికాషనరీ డోస్ (బూస్టర్) తీసుకునేందుకు వారు అర్హులని ఆ లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రికాషనరీ డోస్ ఇవ్వడమనేది వాళ్లు అంతకుముందు రెండో డోసు ఎప్పుడు తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని, సెకెండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాతే వారు ప్రికాషనరీ డోస్ తీసుకునేందుకు అర్హులవుతారని తెలిపారు.

Updated Date - 2021-12-28T22:10:32+05:30 IST