బడ్జెట్‌ ఉన్నా...అందని భత్యం...!

ABN , First Publish Date - 2021-06-22T06:42:12+05:30 IST

విద్యార్థులకు అందాల్సిన రవాణా భత్యానికి మోక్షం లభించట్లే దు. బడ్జెట్‌ ఉన్నా.. బడి పిల్లలకు ఎదురుచూపులు తప్పట్లేదు. సమగ్రశిక్ష అధికారులు, జిల్లా ఉ న్నతాధికారులు పెద్దగా దృష్టిపెట్టకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.

బడ్జెట్‌ ఉన్నా...అందని భత్యం...!

 విద్యార్థుల దరిచేరని రవాణా భత్యం

 5,537 మంది ఎదురుచూపులు..

 రూ.1.87 కోట్లు పెండింగ్‌లో..

 ఫైల్‌ చేరినా... ఆమోదించని దుస్థితి..


అనంతపురం విద్య, జూన్‌ 21: విద్యార్థులకు అందాల్సిన రవాణా భత్యానికి మోక్షం లభించట్లే దు. బడ్జెట్‌ ఉన్నా.. బడి పిల్లలకు ఎదురుచూపులు తప్పట్లేదు. సమగ్రశిక్ష అధికారులు, జిల్లా ఉ న్నతాధికారులు పెద్దగా దృష్టిపెట్టకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో రూ.1.78 కోట్లు బడ్జెట్‌ పద్దుల్లో మూలుగుతోంది. పిల్లల చేతికి మాత్రం చేరడంలేదు.


ఏదీ రవాణా భత్యం..?

విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే క్రమంలో ప్రైమరీ పాఠశాలలు కిలోమీటరు వరకూ, ప్రాథమికోన్నత పాఠశాలలు 3 కిలోమీటర్ల  వరకూ రవాణా చేయాల్సి ఉంటే.. అలాంటి విద్యార్థులకు ఏటా రవాణా భ త్యం చెల్లిస్తారు. ఏటా రమారమి 10 నెలల కాలానికి నెలకు రూ.600 చొప్పున రూ.6 వేలు విద్యార్థులకు అందిస్తారు. 2020-2021 విద్యా సంవత్సరం ముగిసినా నేటికీ విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వ రకూ 5537 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం కరోనా వల్ల ప్రైమరీ పాఠశాలలు 4 నెలలు నడవగా దీనికి అర్హులైన ఒక్కో విద్యార్థికి రూ.2400, ప్రాథమికోన్నత పాఠశాలలు 6 నెలలు నడవగా అర్హులైన ఒక్కో విద్యార్థికి రూ.3,600 చొప్పున 5537 మందికి చెల్లించేందుకు రూ. 1.87 కోట్లు బిల్లులు పెట్టారు. ఆ ఫైల్‌కు ఉన్నతాధికారుల నుంచి మోక్షం లభించడం లేదు.


కరోనా కష్టకాలంలో...

కరోనా వల్ల ఇబ్బంది పడని వారుండరు. ఈ కష్టకాలంలో కాస్త ఆర్థిక ఊరట లభించినా... మేలే. మరీ ముఖ్యంగా స్కూళ్లు నడవని పరిస్థితు ల్లో కనీసం రవాణా భత్యం పిల్లలకు అందినా... వారికి మంచి పౌష్టికాహారం అందించేందుకు దోహదపడుతుంది. 2020-2021 ఏడాదికి సంబంధించి రవాణా భత్యం చెల్లించే ఫైల్‌ రెండు నెలల కిందటే సిద్ధమైనట్లు సమాచారం. ఆ ఫైల్‌ సమగ్రశిక్ష ప్రాజెక్టు చైర్మన్‌ కలెక్టర్‌ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమోదముద్ర పడకపోవడం వల్ల పిల్లల చేతికి రవాణా భత్యం అందలేదు. ఇప్పటికైనా దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, పిల్లలకు అందేలా చూడాలని కోరుతున్నారు.


Updated Date - 2021-06-22T06:42:12+05:30 IST