నో మాస్క్‌-నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-21T05:36:12+05:30 IST

నో మాస్క్‌-నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి

నో మాస్క్‌-నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి
అవగాహన కల్పిస్తున్న శ్యాంసుందర్‌

ఆమనగల్లు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తే చర్యలు తప్పవని ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌ సుందర్‌ హెచ్చరించారు, ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా ఆమనగల్లును తీర్చి దిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. పట్టణంలో గురువారం సాయంత్రం దుకాణాలను ఆయన తనిఖీలు చేశారు. ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అలాగే 15ఏళ్లు నిండి ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని పట్టణంలోని, వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. దుకాణాల వద్ద వ్యాపారులు నో మాస్క్‌-నో ఎంట్రీ బోర్డులు పెట్టుకోవాలని కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ సతీష్‌, రామకృష్ణ, పర్వతాలు, సాయి, మనీషా పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:36:12+05:30 IST