‘బీమా’ లేకుంటే... ‘రుణం’ లేదు

ABN , First Publish Date - 2021-07-23T02:11:01+05:30 IST

గృహరుణాలకు సంబంధించి పెరుగుతోన్న డిమాండ్ నేపధ్యంలో పలు ప్రైవేటు బ్యాంకులు సదరు రుణం పొందాలంటే... బీమా చేయాల్సిందేనని పట్టుబడుతూ లక్షల రూపాయలను దండుకుంటున్నాయి.

‘బీమా’ లేకుంటే... ‘రుణం’ లేదు

హైదరాబాద్ : గృహరుణాలకు సంబంధించి పెరుగుతోన్న డిమాండ్ నేపధ్యంలో పలు ప్రైవేటు బ్యాంకులు సదరు రుణం పొందాలంటే... బీమా చేయాల్సిందేనని పట్టుబడుతూ లక్షల రూపాయలను దండుకుంటున్నాయి. ఆస్తి తనఖా పెట్టుకున్నా కూడా... బీమా లేకుంటే రుణమివ్వలేమంటూ తెగేసి చెబుతున్నాయి. సాధారణంగా గృహరుణాలకు సంబంధించి... రుణం తీసుకునే వ్యక్తి కొనుగోలు చేసే ఇంటి విలువ, అతని ఆదాయం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, సిబిల్ స్కోర్ తదితర అంశాలతోపాటు,  కొనుగోలు చేసే ఆస్తకి సంబంధించిన డాక్యుమెంట్లను  పక్కాగా చూసుకొన్న తర్వాతే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయన్న విషయం తెలిసిందే.


రుణం తీసుకునే వ్యక్తి యొక్క సదరు గృహాన్ని కూడా బ్యాంక్ పేరుతో మార్ట్ గేజ్ చేసుకుని తదనుగుణంగా బ్యాంకులు రుణాలనిస్తాయి. అయితే కొత్తగా చాలా ప్రైవేటు బ్యాంకులు గృహరుణాలు తీసుకునే వారు... తప్పనిసరిగా ఇన్సూరెన్స్ యించుకోవాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నాయి. బీమా లేకపోతే సెక్యూరిటీ లేదని చెప్తున్నాయి. రుణాలను తీసుకోవాల్సిన అవసరమున్న వారు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో కొంత కుదేలవుతున్నారు. 

Updated Date - 2021-07-23T02:11:01+05:30 IST