హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కాల్పుల ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పాపాలు చేశారు కాబట్టే అసద్‌పై కాల్పులు జరిగాయని ఏబీఎన్‌తో ఆయన అన్నారు. అసద్‌పై కాల్పులను తాను సమర్థించడం లేదన్నారు. ఎంఐఎంతో బీజేపీకి దోస్తీ ఉండదని కేవలం కుస్తీ మాత్రమే ఉంటుందని ఏబీఎన్‌తో రాజాసింగ్ అన్నారు. తన ఫోన్ నెంబర్‌ను మంత్రి కేటీఆర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని ఆయన తెలిపారు. తన నియోజకవర్గ సమస్యలపై ఫోన్ చేస్తుంటే కేటీఆర్ స్పందించడం లేదన్నారు. కేంద్రాన్ని విమర్శించే అర్హత కేటీఆర్‌కి లేదని ఏబీఎన్‌తో ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి