బీమా లేదు.. పెళ్లికానుకా లేదు

ABN , First Publish Date - 2022-06-30T04:54:05+05:30 IST

చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రమాద లేక సాధారణ మృతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం(బీమా) అమలు కాకపోవడంతో ఆయా కుటుంబాల వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఈ పథకం చంద్రన్న బీమా పేరుతో అమలు కాగా ప్రస్తుత ప్రభుత్వం దానిని వైఎస్సార్‌ బీమాగా మార్పు చేసింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి 18 నుంచి 50 వయసులోపు మృతిచెందిన వారికి రూ.2 లక్షలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం దానిని లక్షకు తగ్గించింది.

బీమా లేదు..  పెళ్లికానుకా లేదు
గత ప్రభుత్వ హయాంలో ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి తక్షణసాయం అందిస్తున్న వెలుగు సిబ్బంది (ఫైల్‌)

- రూ. 2 లక్షల నుంచి లక్షకు తగ్గిన సాధారణ బీమా

 అదీ పూర్తిస్థాయిలో అమలుకాక కుటుంబీకుల  తిప్పలు

చీరాలటౌన్‌, జూన్‌ 29 : చీరాల నియోజకవర్గ పరిధిలో ప్రమాద లేక సాధారణ మృతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం(బీమా)   అమలు కాకపోవడంతో ఆయా కుటుంబాల వారు  తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఈ పథకం చంద్రన్న బీమా పేరుతో అమలు కాగా ప్రస్తుత ప్రభుత్వం దానిని వైఎస్సార్‌ బీమాగా మార్పు చేసింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి 18 నుంచి 50 వయసులోపు మృతిచెందిన వారికి రూ.2 లక్షలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం దానిని లక్షకు తగ్గించింది. అలాగే 51 నుంచి 60 మధ్యలో వయసు గలవారికి గత ప్రభుత్వంలో రూ.30 వేలు వరకు అందించింది. కానీ ఈసారి అది పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసింది. అయినా 18 నుంచి 50 మధ్య చనిపోయిన కుటంబాల వారికి చాలామందికి నేటికీ ఖాతాల్లో జమ కాక అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఈ పఽథకం గతంలో అమలు జరిగేందుకు అప్పటి ప్రభుత్వం వెలుగు కార్యాలయాల ద్వారా బీమా మిత్రలను ఏర్పాటుచేసి తక్షణ సాయం కోసం సమాచారం అందగానే బీమా మిత్రలు వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న నగదును అందిస్తారు. అలాగే నెలలోపు మిగిలిన నగదు నామినీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది.  ప్రస్తుతం అన్ని పరిస్థితులు మారాయి. యాప్‌లను సచివాలయాలకు అప్పగించారు. పైగా కొన్ని సముదాయాలను వలంటీర్‌లకు, మరి కొన్నింటిని వెల్ఫేర్‌ సెక్రటరీలకు అందించారు. ఈక్రమంలో సరియైున విద్యార్హత , అవగాహన లేని వలంటీర్‌లు ఎవరైనా చనిపోతే సంబంధిత కాల్‌ సెంటర్‌కు సమాచారం అందించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈక్రమంలో మృతిచెందిన కుటుంబీకుల సర్టిఫికెట్స్‌ తీసుకుని సామాన్య ప్రజలు సచివాలయాలు వ మండల కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి బతుకు జీవుడా అంటూ పథకాన్నే వదిలేస్తున్నారు. అలాగే చాలామంది అర్హులకు కనీస రిజిస్ట్రేషన్‌లు కూడా జరపకుండా కొంతమేరకు మాత్రమే రికార్డులో చూపడం గమనార్హం. ఈక్రమంలో పఽథకం ప్రజలకు అవసరం తీర్చేందుకా లేక తిప్పలు పెట్టేందుకా అర్థంకాని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. 


కానరాని పెళ్లి కానుక...

గత ప్రభుత్వంలో బడుగు, బలహీన, మైనార్టీల కుటుంబాలలో ఏదయినా పెళ్లి కుదిరినప్పుడు రూ.40 వేలు నుంచి రూ.50 వేల వరకు ప్రభుత్వం పెళ్లి కానుక పథకం ద్వారా అందించింది. ఈక్రమంలో సామాన్యులకు అది పెద్ద ఊరటగా ఉండేది. కానీ ఈసారి అది పూర్తిగా రద్దు చేయడంతో ఏదైనా శుభకార్యం సమయంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈపథకం అమలు చేసేందుకు సైతం వెలుగు కార్యాలయం ద్వారా కళ్యాణ మిత్రలను ఏర్పాటు చేసి వేగవంతంగా నిర్వహణ చేశారు. వీలయితే ప్రస్తుత ప్రభుత్వం పెళ్లి కానుక అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

ఏడాదైనా బీమాసాయం అందలేదు 

నా భర్త గతేడాది ఆరవ నెలలో మృతిచెందాడు. ఈక్రమంలో ఇరువురు చిన్న పిల్లలతో పూట గడిచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. బీమా కోసం అన్ని ప్రభుత్వ పాలకులు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. రెండేళ్లయిన ప్రభుత్వం మా గోడు పట్టించుకోలేదు. దీంతో నానా అవస్థలు పడుతున్నాం. అధికారులు మాగోడు పట్టించుకోవాలి. 

- కవిత, మృతుని భార్య


Updated Date - 2022-06-30T04:54:05+05:30 IST