పట్టా ఇచ్చినా ఇళ్లకు నోచుకోని పేదలు ..!

ABN , First Publish Date - 2021-04-19T06:13:08+05:30 IST

ఎర్రగొండపాలెం మండలకేంద్రంలో 12 సంవత్సరాలుగా నివేశసన స్థలాల సమస్య పరిష్కారం కాలేదు.

పట్టా ఇచ్చినా ఇళ్లకు నోచుకోని పేదలు ..!
ఎర్రగొండపాలెం సర్వే నెంబరు 539-1 అక్రమంగా వేసిన బేష్‌ మట్టాలు

హద్దులు చూపించి, స్వాధీనం చేయని అధికారులు

ఆ స్థలంపై ఆక్రమణదారుల కన్ను

నకిలీ పట్టాలతో నిర్మాణాలకు ప్రయత్నం

వివాదాస్పదంగా మారిన వైనం

న్యాయం చేయాలని నిజమైన లబ్ధిదారుల విజ్ఞప్తి

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 18 : ఎర్రగొండపాలెం మండలకేంద్రంలో 12 సంవత్సరాలుగా నివేశసన స్థలాల సమస్య పరిష్కారం కాలేదు. హైవేకు సమీపంలో సర్వే నెంబర్‌ 539-1లో 10 ఎకరాల విస్తీర్ణంలో 12 ఏళ్ల క్రితం పేదలకు పట్టాలు ఇచ్చారు. అవి నేటికీ వారికి స్వాధీనం చేయలేదు. 2007-2008లో అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి 300 మం ది లబ్ధిదారులకు నివేశన స్థలాలకు పట్టాలు ఇచ్చారు. 2011లో ఇదే సర్వేనెంబర్‌లో 80 మంది దర్జీలకు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు.  2007 నుం చి 2011 సంవత్సరాలలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో లే అవుట్స్‌ లేకుండానే పట్టాలు పంపిణీ  చేశారు. దీంతో పట్టాలు పొందిన లబ్ధిదారులు హద్దులు చూపించకపోవడంతో వాటిని నిర్మించుకోలేకపోయారు. కొందరు బేష్‌ మ ట్టాల వరకూ వేసినప్పటికీ హద్దులు లేకుండా ఇంటి నిర్మాణం ఎలా చే స్తారని వారిలో కొందరు నిలదీయడంతో నిలిపివేశారు. దీంతో అక్కడ ఎ లాంటి నిర్మాణాలు సాగలేదు. ఈ క్రమంలో ఆ స్థలంలో కొందరు వ్యక్తులు నకిలీ పట్టాలు  సృష్టించి ఫోర్జరీ రెవెన్యూ అధికారుల సంతకాలతో  విక్ర యాలు జరిపారు. నకిలీ పట్టాలు పొందిన వ్యక్తులు ఆక్రమణలు చేసి బే ష్‌ మట్టాలు వేశారు. దీంతో మొదట పట్టాలు పొందిన పేదలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 2013 సంవత్సంలో అధికారులు నిషేధం విధించారు. మరలా 2020లో కొందరు వ్యక్తులు నకిలీ పట్టాలు సృష్టించి విక్రయాలు జరిపేందుకు ప్రయ త్నించారు. దీంతో ఆ స్థలంపై తరచూ గొడవలు పెరి గాయి. ఆ క్రమంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుల సంఖ్య అధికమైంది. 2020 డిసెంబర్‌లో పోలీసు, రెవె న్యూ అధికారులు  ఆ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ఎవరూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.  ఈ స్థలంలో మరో సారి సర్వే నిర్వహించి గతంలో పట్టాలు పొందిన వారు ఎవరు, నకిలీ ఎవరు అనేది తేల్చుతామని, నిజమైన లబ్ధి దారులకు అనుమతి ఇస్తామని తహసీల్దార్‌ తెలిపారు.  

నిషేధం బోర్డును ఏర్పాటు చేసి ఆరు నెలలు గడిచినా నేటికీ సర్వే చేయలేదు. అక్కడి సమస్యను కూడా గర్తించలేదు. సర్వే నెంబరు 539-1 లో బేష్‌మట్టాలు వేసుకు న్న లబ్ధిదారులు వాపోతున్నారు. తహసీల్దారు నెహ్రుబా బు 2021 జనవరి నెలలో సెలవులో వెళ్ళారు.  నిషేధం బోర్డు ఏర్పాటు చేసి 6 నెలలు గడిచినా సమస్య  ఎక్కడి వేసిన గొంగళి అక్కడ  అన్నట్లు ఉంది.  సర్వే  చేసి న కిలీ పట్టాలు రద్దుచేయాలని నిజమైన లబ్ధిదారులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-04-19T06:13:08+05:30 IST