బడికి వెళ్తామనే నమ్మకం లేదు: అఫ్ఘాన్ బాలికల ఆవేదన

ABN , First Publish Date - 2021-10-18T00:33:33+05:30 IST

సెప్టెంబర్ 18న తాలిబన్లు ఒక ప్రకటన చేశారు. మగ టీచర్లు, 13 ఏళ్లు దాటిన బాలురు బడికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. కొవిడ్ కారణంగా ఎంత వరకు తమ చదువు ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభించుకోవచ్చని చెప్పారు. అయితే మహిళా టీచర్లు, బాలికల గురించి వారు ప్రస్తావించలేదు

బడికి వెళ్తామనే నమ్మకం లేదు: అఫ్ఘాన్ బాలికల ఆవేదన

కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో పాఠశాలకు వెళ్లే బాలికల పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఉగ్రవాదుల దాడులు, ఇస్లామిక్ చట్టాల పేరుతో ఆంక్షలు వారి చదువుకు భవిష్యత్‌కు గుదిబండగా మారాయి. ఈ రెండు కారణాలతో వేల మంది బాలికలు చదువుకు దూరమై భవిష్యత్‌ను కోల్పోతున్నారు. అఫ్ఘాన్‌ తాజాగా తాలిబన్ చేతుల్లోకి వెళ్లాక ఈ పరిస్థితి మరింత విషమించింది. తాలిబన్ల ఆంక్షల నేపథ్యంలో చాలా మంది బాలికలు బడికి దూరమవుతున్నారు. తమకు చదువుకోవాలని ఉందని, అయితే తాలిబన్ల వల్ల అది సాధ్యం కావడం లేదని అఫ్ఘాన్ బాలికలు వాపోతున్నారు.


16 అమీనా అనే అఫ్ఘాన్ బాలిక, తన చదువుకు ఎదరురవుతున్న ఇబ్బందుల గురించి చెప్తూ ‘‘నాకు చదువుకోవాలని ఉంది. నాతోటి విద్యార్థుల భవిష్యత్‌లాగే నా భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని ఉంది. కానీ నాకు చదువుకునే అవకాశం లేదని అనిపిస్తుంది. నేను బడికి వెళ్లే అవకాశాన్ని కోల్పోయాను. ఈ పరిస్థితి నన్ను తీవ్రంగా బాధిస్తోంది. తాలిబన్లు వచ్చిన నాటి నుంచి నాలాంటి ఎంతో మంది బాలికల పరిస్థితి ఇలాగే మారిపోయింది. నాకు తాలిబన్లపై చాలా కోపం వస్తోంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నాను’’ అని వాపోయింది.


సెప్టెంబర్ 18న తాలిబన్లు ఒక ప్రకటన చేశారు. మగ టీచర్లు, 13 ఏళ్లు దాటిన బాలురు బడికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. కొవిడ్ కారణంగా ఎంత వరకు తమ చదువు ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభించుకోవచ్చని చెప్పారు. అయితే మహిళా టీచర్లు, బాలికల గురించి వారు ప్రస్తావించలేదు. అనంతరం కొద్ది రోజులకు సెకండరీ పాఠశాల విద్యార్థినులకు చదువుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఒకరి తోడుతో బడికి రావాలని దానికి తోడు ఇస్లామిక్ చట్టాలను నిష్టగా పాటిస్తే చదువుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-18T00:33:33+05:30 IST