మైనారిటీ విద్యాసంస్థల్లోనూ hijab ధరించొద్దు...కర్ణాటక సర్కారు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-02-18T13:15:43+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని మైనారిటీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్ ధరించవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది....

మైనారిటీ విద్యాసంస్థల్లోనూ hijab ధరించొద్దు...కర్ణాటక సర్కారు ఆదేశాలు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మైనారిటీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్ ధరించవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలు ఉండకూడదన్న హైకోర్టు ఆదేశం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని మైనారిటీ సంస్థలకూ వర్తిస్తుందని పేర్కొంటూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.మైనారిటీ సంక్షేమ శాఖ, మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్స్ (ఇంగ్లీష్ మీడియం) , రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని మైనారిటీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ కార్యదర్శి మేజర్ పి మణివణ్ణన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు.కొన్ని మైనారిటీ సంస్థలలో విద్యార్థులకు యూనిఫాం హిజాబ్ అయినందున మైనారిటీ విద్యా సంస్థల్లోనూ హిజాబ్ ధరించడాన్ని ఆర్డర్ నిషేధించింది.


 ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం విద్యార్థినులు హిజాబ్ ధరించి క్యాంపస్‌కు రావచ్చు కానీ తరగతులకు హాజరుకాలేరు.మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విద్యాసంస్థల తరగతి గదుల్లో హిజాబ్,  కాషాయ కండువాలు, ఇతర మత చిహ్నాలు ధరించడం అనుమతించరాదని సర్కారు ఆదేశించింది.


Updated Date - 2022-02-18T13:15:43+05:30 IST