బీఓఐ ‘రైతులకు సొంతిళ్లు’ పథకానికి స్పందన భారీగానే... కానీ...

ABN , First Publish Date - 2022-01-14T00:18:08+05:30 IST

‘రైతులకు సొంతిళ్లు’కు రుణాలనందించేందుకుగాను ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)’ ‘స్టార్ కిసాన్ ఘర్’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

బీఓఐ ‘రైతులకు సొంతిళ్లు’ పథకానికి స్పందన భారీగానే... కానీ...

హైదరాబాద్ : ‘రైతులకు సొంతిళ్లు’కు రుణాలనందించేందుకుగాను ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)’  ‘స్టార్ కిసాన్ ఘర్’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతులకు సొంతింటి కలను సాకారం చేయనుంది. ఈ స్కీమ్ కింద రైతులకు రూ. 50 లక్షల వరకు రుణాన్నందించనుంది బీఓఐ. అయితే పథకం ఉద్దేశం సహేతుకంగానే ఉన్నప్పటికీ... రైతులనుంచి మాత్రం ఆశించినంతగా స్పందన రావడంలేదన్న అభిప్రాయాలు బ్యాంకు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. బీఓఐ... సొంతింటి నిర్మాణానికిగటాను... రైతులకు రుణాన్నందించేందుకు ‘స్టార్ కిసాన్ ఘర్’ పథకాన్ని బీఓఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు సొంతింటి కలను సాకారం చేసేందుకు బ్యాంకు సన్నద్ధమైంది. రైతులు కొత్త ఇంటిని కట్టుకోవడానికి, లేదా... పాత ఇంటికి మరమ్మత్తులు చేయించుకునేందుకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను ఈ పథకం కింద బీఓఐ అందించనుంది. 


రూ.50 లక్షల వరకు రుణం...

కాగా బీఓఐ ఖాతాదారులకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనమందుతుంది. ఈ పథకం ద్వారా  ప్రయోజనాలు పొందేందుకు బ్యాంకు కొన్ని అర్హతలను నిర్ణయించింది. వీటి ప్రకారం రైతులు తమ వ్యవసాయ భూమిలో మాత్రమే నిర్మాణాలను జరపాల్సి ఉంటుంది. అది...ఫామ్‌హౌజ్‌ అయినా అయి ఉండాలి, లేదా... పాత ఇంటికి మరమ్మత్తులైనా చేస్తూ ఉండాలి. తమకు నచ్చిన ఇంటిని సొంతం చేసుకునేందుకు, రైతులకు 8.05 శాతం వడ్డీ రేటుతో రూ. లక్ష-రూ. 50 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రైతులకు పదిహేనేళ్ళ వ్యవధి ఉంటుంది.  Card వాడుతుంటే ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు!



ట్విటర్‌లో వెల్లడి...

ఈ వివరాలను బీఓఐ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారావెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేసీసీ అకౌంట్‌తో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించే రైతులు మాత్రమే ఈ స్కీమ్ నుంచి ప్రయోజనాలను పొందేందుకు అర్హలను స్పష్టం చేసింది. కొత్త ఫామ్ హౌజ్ నిర్మాణానికి లేదా, ఉన్న ఇంటికి మెరుగులు దిద్దుకునేుందుకు ఈ రుణాన్ని జారీ చేస్తామని తెలిపింది. అయితే రినోవేషన్ వర్క్‌కి రూ. లక్ష-రూ. 10 లక్షల వరకే రుణాన్నిస్తుంది బీఓఐ. ఇక ఈ రుణాన్నందుకునేందుకుగాను రైతులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు.  బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ ‘స్టార్ కిసాన్ ఘర్’ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు ఆఫ్ ఇండియా వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. లేదంటే... దగ్గరలోని బీఓఐ శాఖనైనా సంప్రదించవచ్చు. లేదా... 1800 103 1906 కు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు.


ఇక విషయానికొస్తే... ఈ పథకంపట్ల రైతుల నుంచి తాము ఆశించినంతగా స్పందన రావడంలేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పథకానికి భారీ స్పందన వస్తుందని ఆశించామని, అయితే... ఇప్పటివరకూతే సాధారణ స్పందన మాత్రమే లభ్యమైందని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో... పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మరోమారు పరిశీలించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. మొత్తంమీద... రైతులకు సొంతిళ్ళను అందించడమన్న తమ పథకానికి రానున్న రోజుల్లో మరింత భారీ ప్రచారాన్ని కల్పించేందుకు నిర్ణయించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో... మరికొన్ని రాయితీలను కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వ్యాఖ్యానాలు సైతం వినవస్తుండడం గమనార్హం. వాస్తవానికి... పథకంపట్ల భారీ సంఖ్యలో రైతులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటికీ, బ్యాంకు వరకు రైతులు ఆశించినంత సంఖ్యలో రాకపోవడంపై దృష్టి సారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-01-14T00:18:08+05:30 IST