జీమెయిల్‌ వద్దా! ఇవి ట్రై చేయండి

ABN , First Publish Date - 2022-07-02T08:50:09+05:30 IST

జీమెయిల్‌కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే ఇది మెయిల్‌కి పర్యాయపదంగా మారింది.

జీమెయిల్‌ వద్దా! ఇవి ట్రై చేయండి

జీమెయిల్‌కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే ఇది మెయిల్‌కి పర్యాయపదంగా మారింది. అయితే  జీమెయిల్‌ని ఇష్టపడనివారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. డైలీ  వర్క్‌లైఫ్‌ సోషల్‌ లైఫ్‌కు విభజన గీతగా కొందరు జీమెయిల్‌కు బదులు మరొకటి చూస్తున్నారు. కొందరు గూగుల్‌కు వ్యతిరేకం కాగా మరికొందరికి అక్కడ వచ్చే యాడ్స్‌పై విసుగు చెందుతున్నారు. జీసూట్‌ యాప్స్‌పై గూగుల్‌ ముద్రలు సరేసరి. కారణం ఏదైనప్పటికీ జీమెయిల్‌కు ప్రత్యామ్నా యంగా మరికొన్నింటిని కూడా ఉపయోగించు కోవచ్చు. అవి ఏవంటే...

ఆల్టర్నేట్‌


యాపిల్‌ ఐక్లౌడ్‌ మెయిల్‌

యాపిల్‌ ఎకో సిస్టమ్‌లో ఉంటుంది. యాపిల్‌ అకౌంట్‌ ఉంటే, యాపిల్‌ ఈమెయిల్‌ అడ్రస్‌ కూడా ఉన్నట్టే. యాపిల్‌ లేదంటే ఐక్లౌడ్‌ పోర్టల్స్‌లోకి వెళ్ళి ఈ విషయాన్ని చెక్‌ చేసుకోవచ్చు. యాపిల్‌ యూజర్‌ అయితే చాలు, దానికి అనుగుణ్యమైన  డివైస్‌ నుంచి యాపిల్‌ మెయిల్‌ యాప్‌ ద్వారా ఈమెయిల్‌ పంపుకోవచ్చు. ఈ యాప్‌ను ఒక అడ్రస్‌ నుంచి మేనేజ్‌ చేయవచ్చు.  


యాహూ మెయిల్‌

గూగుల్‌ కంటే ముందు నుంచి ఉన్న యాప్‌ ఇది. మెయిల్‌ వాడటం మొదలు పెట్టిన కొత్తలో అందరూ దాదాపుగా యాహూ యూజర్లే. కానీ క్రమంగా గూగుల్‌కు షిఫ్ట్‌ అయ్యారు. జీమెయిల్‌కి ప్రత్యామ్నాయం కావాలంటే యాహూ బెటర్‌. ఇందులో పెయిడ్‌, ఫ్రీ వెర్షన్స్‌ ఉన్నాయి. ఉచితం కింద యూజర్లకు ఒక టీబీ స్టోరేజ్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. పెయిడ్‌ కింద నెలకు అయిదు డాలర్లు చెల్లించాలి. అయిదు టీబీ స్టోరేజీ అవకాశం లభిస్తుంది.   


ఫాస్ట్‌మెయిల్‌

నెలకు మూడు డాలర్లు లేదంటే ఏడాదికి ముప్పయ్‌ డాలర్లకు దీని సబ్‌స్ర్కిప్షన్‌. బేసిక్‌ వెర్షన్‌లో రెండు జీబీ స్టోరీజ్‌ సదుపాయం ఉంటుంది. ప్రామాణిక అలాగే ప్రొఫెషనల్‌ అకౌంట్స్‌కు నెలకు అయిదు డాలర్లు, ఏడాదికి 50 డాలర్లు కాగా 30 జీబీ సదుపాయం ఉంటుంది నెలకు తొమ్మిది డాలర్లు, ఏడాదికి 90 డాలర్లు, వెయ్యి జీబీ స్టోరేజీ ఆప్షన్‌ కూడా ఉంది.   


ఔట్‌లుక్‌.కామ్‌

మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌ ఉండి ఔట్‌లుక్‌.కామ్‌ లేని పక్షంలో దీనిని ఉచితంగా పొందవచ్చు. మైక్రోసాఫ్ట్‌, ఔట్‌లుక్‌ కలగలిసి ఎంఎస్‌ ఆఫీస్‌ సూట్‌ యాప్స్‌ అంటే వర్డ్‌, ఎక్సెల్‌ వంటివి ఉంటాయి. ఈ మెయిల్స్‌ను ప్రత్యేకీకరించుకునేందుకు ఇన్‌బాక్స్‌, అదర్‌బాక్స్‌ ఉంటాయి. ఫ్రీ అకౌంట్‌కు 15జీబీ ఈమెయిల్‌, 5జీబీ ఒన్‌ డ్రైవ్‌ స్టోరేజీ ఉంటాయి. మైక్రోసాఫ్ట్‌ 365 అకౌంట్‌ కావాలని అనుకుంటే ఏటా 69.99 డాలర్లు ఒక వ్యక్తి లేదా యావత్తు ఫ్యామిలీ 99.99 డాలర్లు చెల్లించి 50 జీబీ ప్లస్‌ ఒక డ్రైవ్‌ స్టోరేజీ ఒక టీబీ పొందవచ్చు. ఇందులో ఈమెయిల్స్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయి. ప్రకటనలను తొలగిస్తారు. మైక్రోసాఫ్ట్‌ 365 సబ్‌స్ర్కిప్షన్‌ ఉంటే ఎంఎస్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆఫీస్‌ సంబంధ వ్యవహారాలకు ఉపయోగపడే యాప్‌ ఇది.


ప్రోటాన్‌ మెయిల్‌

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెయిల్స్‌ పంపుకొనే సదుపాయం ఉంటుంది. ఇందులో కూడా ఫ్రీ, పెయిడ్‌ సర్వీస్‌లు ఉన్నాయి. ఎ ప్లస్‌ అకౌంట్‌ అయితే నెలకు అయిదు యూరోలు, ఏడాదికైతే 48 యూరోలు చెల్లించాలి. అయిదు జీబీ స్టోరేజ్‌, కస్టమ్‌ డొమైన్స్‌, అయిదు ఈమెయిల్‌ అడ్రస్‌లు ఉంటాయి. రోజుకు వెయ్యి మెసేజ్‌లను పంపుకోవచ్చు. ప్రొఫెషనల్‌ కేటగిరిలో నెలకు ఎనిమిది యూరోలు, ఏడాదికి 75 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. విజనరీకి నెలకు 30, ఏటా 288 యూరోలు చెల్లించాలి. 


స్కిఫ్‌ మెయిల్‌

స్కిఫ్‌ మెయిల్‌ యూజర్ల మధ్య ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో ఈమెయిలింగ్‌ సదుపాయం ఉంటుంది. ఉచిత వెర్షన్‌లో పది జీబీ ఈమెయిల్‌ స్టోరేజీ ఉంటుంది. పెయిడ్‌ వెర్షన్‌ నెలకు పది డాలర్లకు లభిస్తుంది. వెయ్యి జీబీ ఈమెయిల్‌ స్టోరేజ్‌కి అవకాశం ఉంటుంది. ఫ్రీ వెర్షన్‌లో ఈ మెయిల్‌కు గరిష్ఠంగా అటాచ్‌మెంట్‌ పైజ్‌ 30 ఎంబి. పెయిడ్‌ వెర్షన్‌లో వెయ్యి ఎంబి వరకు అటాచ్‌మెంట్‌లు పంపుకోవచ్చు.

Updated Date - 2022-07-02T08:50:09+05:30 IST