ఆహార భద్రత ఏదీ?

ABN , First Publish Date - 2020-02-20T08:52:35+05:30 IST

పేదవాళ్లకు కడుపు నిండా తిండి పెట్టేందుకు ఉద్ధే శించిన ఆహార భద్రత కార్డుల మంజూరు ప్రక్రియ పది నెలలుగా నిలిచిపోయింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆహార భద్రత ఏదీ?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): పేదవాళ్లకు కడుపు నిండా తిండి పెట్టేందుకు ఉద్ధే శించిన ఆహార భద్రత కార్డుల మంజూరు ప్రక్రియ పది నెలలుగా నిలిచిపోయింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రేషన్‌ కార్డుల ద్వారా వచ్చే సబ్సిడీ బియ్యంతో పాటు విలువైన ఆరోగ్యశ్రీ కార్డులను పొందలేని పరిస్థితి ఏ ర్పడింది. అనారోగ్యం బారినపడిన వాళ్లు వ్యాధులను నయం చేసుకునేందుకు వేలాది రూపాయలు అప్పు లు చేయాల్సి వస్తున్నది. కొత్తగా కార్డుల కోసం దర ఖాస్తు చేసుకున్న వాళ్లు మండల తహసీల్దార్‌ కార్యా లయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేషన్‌ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రకటిం చిన రాష్ట్ర ప్రభుత్వం పది మాసాలుగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడమే గాకుండా చే ర్పులు, మార్పులు కూడా చేయడం లేదు. 


జిల్లాలో 4 వేల దరఖాస్తులు..

జిల్లా వ్యాప్తంగా 4 వేలకు పైగా కొత్త రేషన్‌ కార్డు ల కోసం, చేర్పులు, మార్పుల కోసం చేసుకున్న దర ఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఆహార భద్రత కార్డు రేషన్‌ బియ్యం, తదితర వస్తువులు తీసుకు నేందుకు, ప్రభుత్వ పరంగా సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు. వివిధ రకాల రుణాలను పొందేం దుకు, ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు ఉపయోగప డుతూ ఉంటుంది. ఆ మేరకు ఇప్పటివరకు రేషన్‌ కార్డు లేని వాళ్లు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరు పడి జీవిస్తున్న వాళ్లతో పాటు పెళ్లిళ్లు జరగడం వల్ల అత్తగారింటికి వెళ్లిన వారి పేర్లను తొలగించడంతో పాటు కోడళ్లుగా వచ్చినవారి పేర్లను నమోదు చేసేం దుకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకు న్నారు. ఈ దరఖాస్తులు నేరుగా మండల తహసీ ల్దార్ల లాగిన్‌లోకి వెళతాయి. ఆయన విచారణ కోసం ఆర్‌ఐల లాగిన్‌కు పంపిస్తారు. వాళ్లు విచారణ జరిపి తిరిగి తహసీల్దార్‌ లాగిన్‌కు అక్కడి నుంచి జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి లాగిన్‌కు రేషన్‌ కార్డు మంజూరు కోసం పంపిస్తారు. సంబంధిత అధికారి వాటిని పరిశీలించి రేషన్‌కార్డు మంజూరు చేసి తహ సీల్దార్‌ లాగిన్‌కు పంపిస్తారు. అయితే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి కార్డుల మంజూరు కోసం పంపించే ప్రక్రియ అంతా అయిపోయింది. కానీ ప్రభుత్వం రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ ను తాత్కాలికంగా నిలిపివేయడంతో కొత్తవి మంజూ రు కావడం లేదు. 

ఏప్రిల్‌ నెల నుంచి ఇప్పటివరకు జిల్లాలోనే కా కుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు చేయలేదని తెలుస్తున్నది. జిల్లాలో మొత్తం 2,17,009 కార్డులు ఉండగా, వీటిలో ఆహార భద్రత కార్డులు 2,04,448 కార్డులు ఉండగా, అంత్యో దయ అన్న యోజన కార్డులు 12,378 కార్డులు, అన్న పూర్ణ కార్డులు 181 ఉన్నాయి. వీటి ద్వారా 6,34,378 మంది లబ్ధిదారులు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే రూపాయి కిలో చొప్పున 6 కిలోల బియ్యం తీసుకుం టున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులను మంజూరు చేసి నట్లయితే మరికొంత మందికి ప్రయోజనం కలగ నున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రేషన్‌ కార్డుల మంజూరులో అవకతవకలు జరిగాయని, అనేక బోగస్‌ కార్డులున్నాయని ప్రకటించిన ప్రభు త్వం పాత కార్డులను రద్దుచేసి కొత్తగా దరఖాస్తుల ను స్వీకరించి కార్డులను మంజూరు చేసింది. గతం లో ఒక వ్యక్తికి 4 కిలోల చొప్పున 20 కిలోలకు మిం చకుండా బియ్యం ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఎంత మంది ఉన్నా అన్ని బియ్యం పంపిణీ చేస్తున్నారు. కార్డుల మంజూరు ప్రక్రియను నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం ప్రకటించింది. 


ఎన్నికల కోడ్‌ కారణంగా..

ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ మేరకు కొద్ది రోజుల పాటు కొత్త కార్డుల మంజూరును నిలిపి వేసినప్పటికీ, కోడ్‌ ముగియగానే తిరిగి మంజూరు చేశారు. ఏప్రిల్‌ మాసంలో పార్లమెంట్‌ ఎన్నికలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. జూన్‌ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్‌ ఉండడం తో కొత్త కార్డుల మంజూరును నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మంజూ రు చేసే అవకాశాలున్నప్పటికీ ఏప్రిల్‌ నుంచి ప్రక్రి యను డీఎస్‌ఓ స్థాయిలోనే నిలిపివేశారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం కంటే ఇతరత్రా ప్రయోజనా లను పొందేందుకు ప్రధానంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు పొందడానికి కార్డులు మంజూ రు చేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన రేషన్‌ కార్డులను మంజూరుచేయడంతో పాటు ఉన్న వాటిలో అవసరమైన వాటిలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-02-20T08:52:35+05:30 IST