టీచర్ల ముఖ హాజరు విధానం వద్దు

ABN , First Publish Date - 2022-08-16T06:39:54+05:30 IST

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల ముఖ హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి డిమాండ్‌ చేశారు.

టీచర్ల ముఖ హాజరు విధానం వద్దు
మాట్లాడుతున్న గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి

వెంటనే ఉపసంహరించుకోవాలి

గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి డిమాండ్‌ 

పాడేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల ముఖ హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి డిమాండ్‌ చేశారు. టీచర్ల ముఖ హాజరుపై సోమవారం సాయంత్రం స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో వివిధ ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఉపాఽధ్యాయుల హాజరుకు సంబంధించి ముఖ హాజరు విధానాన్ని అమలు చేయాలనుకోవడం తగదన్నారు. అంతకీ దానిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ప్రతి పాఠశాల హెచ్‌ఎంకు సెల్‌ఫోన్లను పంపిణీ చేయడంతోపాటు ప్రతి పాఠశాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌, డీఈవోలకు వినతిపత్రాలు సమర్పించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు కిముడు దేముళ్లనాయుడు, కుడుముల కాంతారావు, ఆర్‌.జగన్మోహనరావు, వీవీ రమణ, శేషగిరి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:39:54+05:30 IST