ఫేస్‌ యాప్‌ వద్దు

ABN , First Publish Date - 2022-08-18T06:24:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫేషియల్‌ అటెండెన్సు యాప్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండు చేశారు. మంగళవారం నుంచే అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఫేస్‌ యాప్‌ వద్దు
ఎర్రావారిపాలెం ఎంఈవోకు వినతి పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

తిరుపతి(విద్య),ఆగస్టు 17 : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫేషియల్‌ అటెండెన్సు యాప్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండు చేశారు. మంగళవారం నుంచే అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ఉపాధ్యాయసంఘాల సమాఖ్య నేతల పిలుపుతో పలువురు ఉపాధ్యాయులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. మరికొందరు చేసుకున్నా వివిధ సమస్యలతో హాజరు నమోదు చేయలేకపోయారు. అతి తక్కువ మందికే యాప్‌లో హాజరు నమోదైంది. ఈ యాప్‌ను నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతల ఆధ్వర్యంలో ఎంఈవోలకు మూకుమ్మడిగా వినతిపత్రాలు అందించారు.ప్రైమరీ పాఠశాలలో పనిచేసే టీచర్లు ఎంఈవో కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయగా..హైస్కూళ్లలో పనిచేసే టీచర్లు ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలకు యాప్‌లు వద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు.  గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగా పనిచేయక కుస్తీ పడాల్సి రావడంతో సమయం వృథా అవుతోందని, ఈ యాప్‌ ద్వారా టీచర్ల వ్యక్తిగత గోప్యతకు నష్టమని  పేర్కొన్నారు.తాము యాప్‌ను వ్యతిరేకించడం లేదని, కాకుంటే ప్రభుత్వమే ఫేస్‌యాప్‌ టెక్నాలజీకి సరిపడే పరికరాలు, డేటా సదుపాయం కల్పించాలని కోరారు. అంతవరకు ఫేస్‌యా్‌పలో హాజరు వేయబోమని స్పష్టంచేశారు. 

Updated Date - 2022-08-18T06:24:58+05:30 IST