పోటీ పెరగడంతో... హెచ్‌డీఎఫ్‌సీ నుంచి భారీ వృద్ధిని ఆశించని బ్రోకరేజీలు...

ABN , First Publish Date - 2022-01-18T22:06:41+05:30 IST

దేశంలో అతి పెద్ద ప్రైవేటు రంగ రుణదాత... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు... డిసెంబరు త్రైమాసికంలో స్ట్రాంగ్‌ నంబర్లను నివేదించింది.

పోటీ పెరగడంతో... హెచ్‌డీఎఫ్‌సీ నుంచి భారీ వృద్ధిని ఆశించని బ్రోకరేజీలు...

బుల్లిష్ వేఖరినే కొనసాగించినా...

హైదరాబాద్ : దేశంలో అతి పెద్ద ప్రైవేటు రంగ రుణదాత... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు... డిసెంబరు త్రైమాసికంలో స్ట్రాంగ్‌ నంబర్లను నివేదించింది. వార్షిక ప్రాతిపదికన... బలమైన రుణవృద్ధిని, మెరుగైన ఆస్తుల నాణ్యతను నివేదించింది. స్వతంత్ర(స్టాండలోన్‌) నికర లాభం 18 % వృద్ధితో రూ. 10,342 కోట్లకు చేరింది. నిజానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విషయంలో ఇంతకు మించిన నంబర్లను మార్కెట్‌ ఆశించింది. నంబర్లు బలంగానే ఉన్నప్పటికీ, మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఈ నేపధ్యంలో... ఫలితాల  తర్వాత చాలా బ్రోకరేజీలు ఈ స్టాక్ పట్ల బుల్లిష్ వైఖరినే కొనసాగించినా, టార్గెట్‌ ప్రైస్‌లను మాత్రం పెంచలేదు. ఎడెల్‌వైస్‌, యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌, నోమురా, గోల్డ్‌మన్‌ సాచ్స్‌, హెఎస్‌బీసీ, సీఎస్‌ఎల్‌ఏ బ్రోకరేజ్‌లు 'బయ్‌' రేటింగ్‌ కొనసాగించగా, అంబిట్ 'సెల్‌' సిఫారసును అలాగే ఉంచింది. ఇవి... ఫలితాల ముందున్న లక్ష్యాలనే ఫలితాల తర్వాత కూడా అలాగే కొనసాగించాయి. 



లక్ష్యాన్ని పెంచకపోయినప్పటికీ, బ్యాంక్‌ మూడో త్రైమాసిక పనితీరును ఎడెల్‌వైస్ అభినందించింది. కొవిడ్‌ కాలంలోనూ తోటి బ్యాంకుల కంటే ఆస్తి నాణ్యతను తగ్గనివ్వకపోవడం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిస్క్‌ సెలెక్షన్‌కు, మూలధన ఉత్పాదకత స్పృహకు నిదర్శనమన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తుండడం గమనార్హం. కాగా... 17 % ఈపీఎస్ సీఏజీఆర్, 16-18 % ఆర్‌ఓఈ ఆరోగ్యకరమైన వృద్ధిని అందిస్తాయని ఆశిస్తున్నారు. టెక్నాలజీ ఖర్చులు, మమెంటం బిల్డప్‌పై దృష్టి సారించడం కీలకమని ఎడెల్‌వైస్ చెబుతున్నారు. కాగా... పెరిగిన పోటీ కారణంగా బ్యాంకు నుంచి భారీ వృద్ధిని బ్రోకరేజీలు ఆశించడం లేదు. 

Updated Date - 2022-01-18T22:06:41+05:30 IST