మొగల్తూరు, నవంబరు 28 : తుఫాన్ కారణంగా పేరుపాలెం బీచ్ లో ఆదివారం సందర్శకులను అనుమతించేది లేదని తహసీల్దార్ ఎస్కే హుస్సేన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీచ్లో అలల ఉధృతి, ఈదురు గాలులు ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.