వల్లీ అరుణాచలానికి నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-09-23T05:45:56+05:30 IST

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, ఇఐడీ ప్యారీ, చోళమండలం వంటి ప్రముఖ కంపెనీలున్న మురుగప్ప గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అంబాడీ ఇన్వె్‌స్టమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్ల

వల్లీ అరుణాచలానికి నో ఎంట్రీ

మురుగప్ప గ్రూప్‌లో ముసలం


చెన్నై : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, ఇఐడీ ప్యారీ, చోళమండలం వంటి ప్రముఖ కంపెనీలున్న మురుగప్ప గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అంబాడీ ఇన్వె్‌స్టమెంట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో వల్లీ అరుణాచలానికి స్థానం నిరాకరించింది. సోమవారం జరిగిన కంపెనీ ఏజీఎంలో బోర్డు సభ్యులు 91 శాతం మెజారిటీతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఆమె మురుగప్ప గ్రూప్‌ వ్యవస్థాపకుడు దీవాన్‌ బహదూర్‌ ఏఎం మురుగప్పన్‌ చెట్టియార్‌ ముని మనుమరాలు. శతాబ్దాల కాలంగా కంపెనీ పాటిస్తున్న ఆచారం ప్రకారం బోర్డులో మహిళా సభ్యులకు స్థానం లేదు.


అదే ఆచారాన్ని కొనసాగించే విషయంలో ప్రస్తుత బోర్డు దృఢంగా కట్టుబడి ఉన్నదని ఈ చర్య సంకేతం ఇచ్చింది. బోర్డు నిర్ణయంపై ఆమె ఒక ఇ-మెయిల్‌ సందేశంలో స్పందిస్తూ గ్రూప్‌లో మెజారిటీ వాటాదారైన తమ కుటుంబానికి బోర్డులో స్థానం కల్పించకపోవడంపై నిరసన ప్రకటించారు. కుటుంబ వ్యవహారాలు అంతర్గతంగానే తేలాలన్నది తన అభిప్రాయమని, ఇందుకు భిన్నంగా జరిగితే న్యాయపరిష్కారం కోరే అవకాశం కూడా లేకపోలేదని న్యూక్లియర్‌ ఇంజనీర్‌ అయిన ఆమె హెచ్చరించారు.

గ్రూప్‌ ఈడీగా ఉన్న ఆమె తండ్రి ఎంవీ మురుగప్పన్‌ (ఏఎం మురుగప్పన్‌ చెట్టియార్‌ కుమారుడు) మగ వారసులెవరూ లేకుండానే 2017లో మరణించడంతో ఈ వివాదం మొదలయింది. బోర్డు సభ్యత్వానికి ఆడవారికిని దూరంగా ఉంచే ఆచారాన్ని మార్చాలని, కాలానికి అనుగుణంగా మారాలని వల్లీ అరుణాచలం ఈ ఏడాది జనవరి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఏఐఎల్‌లో 8.15 శాతం వాటా గల తమ కుటుంబం నుంచి తనకు లేదా తన సోదరికి గ్రూప్‌లో స్థానం కల్పించాలన్నది ఆమె డిమాండు. 


Updated Date - 2020-09-23T05:45:56+05:30 IST