ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ జొకోకు నో ఎంట్రీ?

ABN , First Publish Date - 2022-01-18T10:37:57+05:30 IST

వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కరోనా వ్యాక్సిన్‌పట్ల విముఖత వదలి..రెండు డోసులు తీసుకోకపోతే ఫ్రెంచ్‌ ఓపెన్‌కూ దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ  జొకోకు నో ఎంట్రీ?

పారిస్‌:  వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కరోనా వ్యాక్సిన్‌పట్ల విముఖత వదలి..రెండు డోసులు తీసుకోకపోతే ఫ్రెంచ్‌ ఓపెన్‌కూ దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ ఆదివారం కొత్త చట్టాన్ని ఆమోదించింది. దీనిప్రకారం వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే వ్యక్తులను రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, కేఫ్‌లు, సుదూర ప్రయాణాల రైళ్లలో అనుమతిస్తారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండబోవని ఫ్రాన్స్‌ క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టంజేసింది. సరైన కారణాలు చూపకుండా కొవిడ్‌ వ్యాక్సిన్‌ మినహాయింపు పొంది ఆస్ట్రేలియాలో ప్రవేశించిన నొవాక్‌ వీసాను ఆ దేశం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ దేశంనుంచి బహిష్కృతుడైన జొకో ఈ సంవత్సరం తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిస్సయ్యాడు. 

Updated Date - 2022-01-18T10:37:57+05:30 IST